ఎలక్షన్ సమయంలో ఎన్నో హామీలు ప్రవాహంలా గుప్పించిన నాయకులు పదవిని అలంకరించగానే అవన్ని మరచి హాయిగా తమ అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.దాదాపు రాజకీయాల్లో వున్న పరిస్దితి ఇదేనని చెప్పవచ్చు,కాని కొందరు నాయకులు మాత్రం ప్రజల కోసమే పుడతారు,అలాంటివారిలో వై ఏస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు.పాదయాత్రచేసి ప్రజల కష్టాలను దగ్గరగాచూసి వారి మనసుల్లో స్దానం సంపాదించుకున్న వై ఎస్సార్ మరణం ప్రజలకు చేదును మిగిల్చింది.ఆతర్వాత రాజకీయాల్లో ఎన్నోమార్పులు సంభవించాయి.తర్వాత జగన్ కూడ తండ్రిబాటలో నడిచి అధికమెజారిటితో యంగ్ సీయం గా ప్రమాణస్వీ కారం చేశారు.ఆనాటినుండి జనంలో ఒకరిగా వుంటు ఒక అన్నలా,ఓ కొడుకులా ఆపదసమయాల్లో ఆదుకుంటు అండగా నిలబడుతున్నాడు.


ఆ చొరవతోనే కష్టాల్లో వున్న వారు జగన్ వున్నాడు అనే ధైర్యంతో ఎలాగోల తనని కలసి తమగోడు వెళ్ళబోసుకుని ఆపదనుండి గట్టెకుతున్నారు.జగన్ ఉన్నాడు అనే భరోసాను జనం గుండెల్లో బలంగా నాటిన ఈ యంగ్ సీయం మరోసారి ఓ దివ్యాంగుడు చెప్పుకున్న కష్టానికి కరిగి సాయం అందిచాడు.


విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం చివర్లో ఓ వ్యక్తి భద్రతా సిబ్బందిని దాటుకొని ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు వెళ్లాడు. అక్కడున్న వారందరు  ముందు షాకైన అతడు తన కష్టాన్ని సీఎంకు చెప్పుకోవడానికి వచ్చాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.విజయవాడకు చెందిన కోలా దుర్గారావు అనే వ్యక్తి.. ఓ ప్రమాదంలో కరెంట్ షాక్‌ తగిలి తన రెండు చేతులు కోల్పోయాడట.ఈ సంఘటనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సెన్సార్లతో పనిచేసే కృత్రిమ చేతులను అమెరికా నుంచి తెప్పించి ఇచ్చారట.


అలాగే ఉద్యోగం కూడా ఇస్తామని హామీ కూడ ఇచ్చారట. కాని హామీ ఇచ్చిన కొద్దిరోజులకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందట.. దీంతో అతడికి ఉద్యోగం రాలేదు. అప్పటి నుంచి ఉద్యోగం విషయంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న అతనికి జగన్ విజయవాడ వస్తున్న విషయం తెలిసి అక్కడికి వెళ్లి తనకు ఉద్యోగం ఇప్పించాలని జగన్‌కు విజ్ఞ‌ప్తి చేశాడు.అతని పరిస్దితికి స్పందించిన జగన్ దుర్గారావు సమస్యను వెంటనే పరిష్కరించాలని కార్యదర్శి ధనుంజయ రెడ్డికి సూచించారట..  



మరింత సమాచారం తెలుసుకోండి: