దేవుడు ఎలా ఉంటాడు అంటే ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి.  దేవుడు ఎలా ఉంటాడు అంటే సాధారణంగా పిల్లను చూపిస్తుంటారు.  పిల్లలంటే దేవుడు.. దేవుడంటే పిల్లలు అంటారు.  ఈ విషయాన్ని కాస్త  పెడదాం.  మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడిని తలచుకుంటాం.  ఎలాగైనా ఆపద నుంచి రక్షించమని కోరుకుంటాం కదా.  



ఆపద ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు.  ఆపద అన్నది చెప్పిరాదు.  వచ్చిన తరువాత దాని నుంచి బయటపడాలి అంటే దానికి తగ్గట్టుగా పరిష్కారం ఆలోచించాలి.  ఎవరో వస్తారో ఎదో చేస్తారు అని కూర్చుంటే పనులు జరగవు.  ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.  ఈ వరదల దాటికి రోడ్లు ఊర్లు అన్ని జలమయం అవుతున్నాయి.  



కర్ణాటకలో ఈ వరద తాకిడి ఎక్కువగా ఉన్నది.  కర్ణాటక లోని రాయచూర్ ప్రాంతంలో వరదల కారణంగా ఆరుగురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.  వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది.  పిల్లలు తీసుకొని బయలుదేరే సమయానికి వరద రావడంతో వెళ్లల్సిన బ్రిడ్జి వరదలో మునిగిపోయింది.  


అంబులెన్స్ కు ఎలా వెళ్లాలో తెలియదు.  అంతలో అక్కడే ఉన్న 12 ఏళ్ల పిల్లవాడు ధైర్యం చేసి నీళ్ళలోకి దిగి వరద నీటిని సాహసం చేసి దాటుకుంటూ వెళ్ళాడు.  ఆ బాలుడు వచ్చిన మార్గంలో అంబులెన్స్ వచ్చింది.  ఈ తంతంగాన్ని అవతలి నుంచి చూస్తున్న వ్యక్తులు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది.  బాలుడు చేసిన సాహసానికి ప్రభుత్వం అతనికి బహుమానం ప్రకటించింది.  బాలుడు చేసిన సాహసం ఆరుగురు పిల్లల ప్రాణాలు కాపాడింది.  అందుకే అంటారు పిల్లలు దేవుడు చల్లని వారే అని. 


మరింత సమాచారం తెలుసుకోండి: