హైదరాబాద్ ఎంపీ స్థానం అంటే అది ఎంఐఎం గెలుచుకుంటుంది  అనే మాట ఎప్పటి నుంచో ఉన్నది.  అన్నట్టుగానే ఆ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంటూ వస్తున్నారు.  ఆ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉన్నప్పటికీ ముస్లిం మెజారిటీ ఎక్కువ.  అందుకే అక్కడ ఎంఐఎం పార్టీ విజయం సాధిస్తూ వస్తున్నది.  ఈపార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో ఉన్న ఏడూ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుస్తూ వస్తుంటారు.  


అయితే, ఈ స్థానంపై బీజేపీ కన్నేసింది.  ఎలాగైనా ఆ స్థానాన్ని గెలుచుకోవాలని చూస్తోంది.  అది సాధ్యం కాకపోవచ్చు.  ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా.  గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది.  ఎవరూ ఊహించలేదు బీజేపీ అన్ని స్థానాలు గెలుస్తుందని.  కనీసం సికింద్రాబాద్ గెలుస్తుందో లేదో అనుకున్నారు.  అన్నింటికీ చెక్ పెడుతూ నాలుగు స్థానాలు గెలిచారు.  విచిత్రం ఏమిటంటే.. నిజామాబాద్ లో కవితపై బీజేపీ విజయం సాధించింది.  


ఇప్పుడు బీజేపీ కన్ను హైదరాబాద్ పై పడింది.  ఎలాగైనా హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవడానికి ఎత్తుగడలు మొదలుపెట్టింది.  ఆర్టికల్ 370 తరువాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.  జమ్మూలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.  కాశ్మీర్లో త్వరలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయి.  


ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో దానిపై అసదుద్దీన్ కు ప్రేమ ఉంటుంది.  దీంతో కాశ్మీర్ పై ప్రేమను కురిపించాడు.  ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు.  దేశంలో గాడ్సేలు ఎక్కువైపోయారని, ఏదోఒక రోజు నన్నుకూడా చంపుతారని అన్నారు.  ఈ మాటల వెనుక భయం ఉన్నదో లేదంటే ఇంకేదైనా ఉన్నదో తెలియదు.  అయితే, ఎంపీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఇప్పటికే తిప్పికొట్టింది . పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత అభివృద్ధిని చూపించి అక్కడ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది బీజేపీ. 

ఒకవేళ నిజంగానే అక్కడ అభివృద్ధిని చూపించి ప్రజలకు ఉపాధి కల్పిస్తే.. తప్పకుండా బీజేపీకి ప్రజలు పట్టం కడతారు.  అందులో సందేహం అవసరం లేదు.  అదే జరిగితే.. హైదరాబాద్ లో హైదరాబాద్ నియోజక వర్గాన్ని బీజేపీ గెలుచుకోవడం కూడా పెద్ద విషయం కాదు.   


మరింత సమాచారం తెలుసుకోండి: