ఎండకాలం వచ్చింది అంటే ఇంట్లో కూలర్.. కారులో ఏసీ లేకుండా బయటకు వెళ్ళలేరు.  బయటకు అడుగుపెట్టాలి అంటే గొడుగు ఉండాలి.  వాటర్ బాటిల్ ఉండాలి.  కాళ్లకు చెప్పులు.. కళ్ళకు గాగుల్స్ తప్పనిసరి.  లేదంటే ఎండ తీవ్రతకు తట్టుకోలేరు.  ప్రాణాలైనా పోవచ్చు. అందుకు ఇవన్నీ ముందుజాగ్రత్త చర్యలు. 



కారులో ఎంత వాటర్ పోసి రేడియేటర్ ను కూల్ చేసినా.. కొద్దిసేపటికే హీటెక్కిపోతుంది.  పైగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి.  వీటి నుంచి బయటపడాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  వీటి నుంచి బయటపడేందుకు ఓ మహిళా భలే ఐడియా వేసింది.  ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్టుగా ఆమె ఐడియా కారును కూల్ చేసింది.  అది సహజసిద్ధంగా.  ఎలా అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.  



గుజరాత్ కు చెందిన మహిళా రోజు కారులో ప్రయాణిస్తుండాల్సి వస్తుండేది.  నిత్యం కారులో ఏసీ వేసుకుంటే.. శరీరానికి మంచిది కాదు.  చర్మం ఇబ్బందులు పడుతుంది.  అందుకే ఆమె ఐడియా వేసింది.  ఆవు పేడను తీసుకొని నీళ్లు పోసి పలచగా కలిపింది.  ఆ పేడను కారుపై అలికిడి.  పూర్వం ఇంట్లో ఆవుపేడను అలికేవారు. అలానే బయట కళ్ళాపి ఆవుపేడతో చల్లేవారు.  



దీని వలన ఎండాకాలంలో కూడా ఇల్లు కూల్ గా ఉంటుంది.  ఇదే ఫార్ములాను కారు విషయంలో ప్రయోగించింది.  సక్సెస్ అయ్యింది.  కారును ఆవుపేడతో అలకడం వలన సహజసిద్ధమైన కూలింగ్ వచ్చింది.  ఎంత కూల్ అంటే.. కారులో ఏసీలో వేసుకుంటే వచ్చే కూలింగ్ కంటే కూడా ఎక్కువ కూలింగ్ వచ్చింది.  న్యాచురల్ కూలింగ్ కాబట్టి అనారోగ్యం కాదు.  మంచి ఆరోగ్యం కూడా. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఆమె నిత్యం అలానే చేస్తోందట.  ఐడియా నచ్చిందా ఐతే మీరుకూడా ఫాలో అవ్వండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: