దేశ రక్షణ మరింత బలోపేతం

 మన దేశ రక్షణ కోసం  సైన్యాన్ని మరింత బలోపేతం చేసే చర్యలకు నరేంద్ర మోదీ సర్కారు నడుం కట్టింది.  దేశ రక్షణ విషయంలో రాజీపడే సమస్య లేదని మరోమారు నిరూపించింది. శత్రు మూకలు ఎటు నుంచి దాడి చేసినా ఎదుర్కొని గట్టిగా బుద్ధి చెప్పగలిగే సామర్ధ్యం  మరియు తిప్పి కొట్టడానికి కావలసిన సత్తా మన త్రివిధ దళాలకు ఉన్నదని చాటి చెప్పే  దిశగా మరో అడుగు ముందుకేసింది.

73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్ర కోట బురుజుల పై నుండి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మాట్లాడుతూ  దేశ రక్షణను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా త్రివిధ దళాలు కలిసి పని చేయ డానికి వీలుగా ఉన్నతస్థాయిలో ఒకఅధికారిని నియమించనున్నట్లు తెలియజేశారు.  దేశ రక్షణ బాధ్యతలను చూసే త్రివిధ దళాలు ఒకే గొడుగు కిందకు చేరి పరస్పర సహకారంతో ముందుకు పోయే విధంగా ఉండడానికి చీఫ్ డిఫెన్స్ స్టాప్ అని పిలవ బడే ఒక కొత్త  పోస్ట్ ను సృష్టించి దాని ద్వారా మన ఆర్మీ, నేవి మరియు ఎయిర్ ఫోర్స్ కలిసి పని చేసే విధంగా ఉంటుందని శ్రీ నరేంద్ర మోడీ చెప్పారు.  

 ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదని  ఎన్నో రోజులుగా ఇలాంటి ఒక పోస్టు  కావాలని మన దేశ రక్షణ వ్యవస్థల అభిమతమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.   త్వరలో ఈ పోస్టు సృష్టించడంతో మన దేశ రక్షణ వ్యవస్థలు చాలా ఆనందిస్తారు  అని అభిలా షించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: