రెండు తెలుగు రాష్ట్రాల్లో వలసలతో బీజేపీ జోరు మీద ఉంది. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటూ బలోపేతం అవ్వాలని చూస్తోంది. ఇప్పటికే రెండు చోట్ల కొందరు నాయకులు బీజేపీలో చేరిపోయారు. అందులో టీడీపీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఇంకా నాయకులు చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 18న తెలంగాణలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పలువురు నాయకులు కాషాయ తీర్ధం పుచ్చుకొనున్నారు.


ఆంధ్రాలో కూడా కొందరు టీడీపీ నాయకులు  బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. అందులోనూ వైసీపీకి అండగా ఉండే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు చేరుతారని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.


ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు రాజకీయంగా అత్యంత బలంగా ఉన్న జిల్లా నుంచి ఒకరు, అలాగే మొన్న ఎన్నికల్లో టీడీపీ నాలుగు సీట్లు గెలిచిన జిల్లా నుంచి ఒకరు చేరుతారని చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు చేసే ప్రచారం అంత నమ్మశక్యంగా లేదు. కేవలం మైండ్ గేమ్ ఆడటానికే ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా అధికార టీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని మైండ్ గేమ్ ఆడుతున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా మొదలుపెట్టారు. 


ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎంపీలు పార్టీ మారుతారంటే నమ్మోచ్చు గాని వైసీపీ ఎంపీలు అంటే కష్టమే. రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న వైసీపీని వదిలేసి 1 శాతం ఓట్లు కూడా తెచ్చుకున్న బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెప్పడం  హాస్యాస్పదంగానే ఉంది. ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ లో భాగమే అని తెలుస్తోంది. దీని ద్వారా వైసీపీని కన్ఫ్యూజ్ చేసి వీక్ చేయాలనే ఇలా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎంపీలు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళడం జరిగే పని కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: