బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరం 

మనదేశంలో ఉన్నా నా ప్రైవేటు బ్యాంకుల పుణ్యమా అని బ్యాంకు ఖాతాదారులకు  రుసుములు అనేవి సర్వసాధారణమైపోయాయి. ఈ రోజున ఏ బ్యాంకులో లావాదేవీ చేసినా చార్జీల రూపకంగా వసూలు చేసే పద్ధతి ఎక్కడి నుంచో మనదేశంలో అడుగుపెట్టిన ప్రైవేట్ బ్యాంకుల  నిర్వాకమే.

ఈరోజు బ్యాంకుకు ఖాతాదారుడు ఏటీఎం కార్డ్ కోసం మొదలు చేసే ప్రతి ఒక్క లావాదేవీకి ఎంతో కొంత  రుసుము చెల్లించ వలసి వస్తున్నది. తన ఖాతా నుండి ఐదు సార్లు మించి ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించుకుంటే లేదా మరి ఏ ఇతర లావాదేవీ నిర్వహించిన  ఆరో లావాదేవీ నుండి ఏటీఎంలో ఖాతాదారుడు జరిపే ప్రతి లావాదేవీకి బ్యాంకులు చార్జీల రూపంలో ఎంతోకొంత విధించి ఖాతాదారులను బాధిస్తున్నాయి. తన ఖాతా నిల్వ  సమాచారం ను ఏటీఎం ద్వారా తెలుసుకునే సందర్భంలో కూడా బ్యాంకు ఒక లావాదేవి గా పరిగణించి చార్జీలు వసూలు చేస్తున్నది. ఒక్కొక్కసారి ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ  జరిగే సమయంలో లావాదేవీ విఫలమైన సందర్భంలో కూడా చార్జీలు వసూలు చేసిన సందర్భాలు ప్రతి బ్యాంకు ఖాతాదారుడు కి అనుభవమే.

 ఇకనుంచి ఇలాంటి అన్ని చర్యలకు చరమగీతం పాడి బ్యాంకులకు ముగ్గులు వేసే కొత్త విధానం ఆర్బిఐ రూపొందించింది.   ఇకనుంచి ఆర్థికేతర లావాదేవీలు అనగా నగదు నిల్వల విచారణ, చెక్కు పుస్తకం అభ్యర్ధన లాంటివి జరిపినప్పుడు వాటికి రుసుములు విధించారని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: