స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -  సోనియాగాంధీ

అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన  రోజునే మనం స్వాతంత్య్రం వైపు అడుగులు వేసినట్లు అవుతుందని అఖిల భారత కాంగ్రెస్  అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ అన్నారు. 73వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకున్న సందర్భం గా ఆమె ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఈ మాటలు అన్నారు.

 ఎంతోమంది మహనీయుల త్యాగాలు ఫలం  మనకు లభించిన ఈ స్వాతంత్రం అని ఆమె చెప్పారు.   మనకు స్వాతంత్రం సిద్ధించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఎంతో మంది భారతీయులు ఉన్నారన్నారు.   వారి త్యాగాల ఫలితం మనం ఈనాడు స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగు తున్నాము అన్నారు. అందువలన వారి త్యాగాలు మన మదిలో ఎప్పటికీ నిలిచి ఉండాలని చెప్పారు. ప్రజలంతా సోదరభావంతో  కలిసి మెలిసి బ్రతకాలని అప్పుడే మన దేశం అభివృద్ధి పథంలోకి సులువుగా తీసుకుపోగల మనీ చెప్పారు. ఈ దేశం అన్ని రంగాల లో అభివృద్ధి చెందాలని కలలు కన్నా మన స్వాతంత్ర సమరయోధుల ఆశలు ఎన్నటికీ  అడియాశలు కాని వద్దని, ప్రతి భారతీయుడు ఈ విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

 మన దేశం స్వాతంత్రం సిద్ధించిన 73 సంవత్సరాల తరువాత కూడా ఇంకా కొన్ని రంగాలలో వెనుకబడి ఉన్నదని అతి త్వరగా ఆయా రంగాలలో పురోభివృద్ధి సాధించాలని ఈ దిశగా మనమందరం కలిసి పనిచేయాలని చెప్పారు. 

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చాలని అంటే  వారు చూపిన అహింసా మార్గంలో ప్రయాణించి నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని శ్రీమతి సోనియా గాంధి తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: