వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తొమ్మిదేళ్లపాటు సీఎం పీఠం కోసం పోరాటం చేసి సాధించుకున్న వ్యక్తి. అనుభవానికీ, కొత్త తరానికి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జనం కొత్త తరానికే అవకాశం ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మీ తలరాతలు మారుస్తానన్న యువ నాయకుడికే ఆంధ్రా జనం పట్టం కట్టారు.


ఆ గెలిపించడం కూడా అలా ఇలా గెలిపించలేదు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ.. తన రాజకీయ చరిత్రలోనే అతి తక్కువ స్థానాలకు పరిమితమైంది. చివరకు వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయే రీతిలో జగన్ ను జనం గెలిపించుకున్నారు. మరి ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో పాపులర్ అయిన వ్యక్తి దేశ స్థాయిలో ఏ ర్యాంకులో ఉంటారు.


ఇది ఆసక్తి కలిగించే అంశమే. అసలు దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత పాపులర్ ఎవరు అనే అంశం తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట ఓ సర్వే నిర్వహించింది. అందులో ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో మూడోస్థానంలో నిలిచారు.


వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన ఈ సర్వేలో 71 శాతం మంది జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమాల పట్ల అత్యధికులు హర్షం వ్యక్తం చేసినట్టు వీడీపీ సర్వేలో వెల్లడైంది. ఇంతకీ జగన్ ర్యాంకు మూడు అయితే మరి పొరుగునే ఉన్న కేసీఆర్ ర్యాంకు ఎంత. ఇది కూడా ఆసక్తికరమే కదా.. కేసీఆర్ ఐదో ర్యాంకులో నిలిచారు.


మూడు, ఐదు సరే.. ఇంతకీ దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం ఎవరో తెలుసా.. ఆయనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఇక రెండో స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. సీనియర్ మోస్ట్ లీడర్, తెలంగాణ ఐకాన్ కేసీఆర్ ఐదో ప్లేసులో ఉంటే కుర్ర సీఎం జగన్ మూడో స్థానంలో నిలవడం విశేషమే.


మరింత సమాచారం తెలుసుకోండి: