స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎట్ హోమ్ కార్యక్రమం పేరిట  తెలంగాణ గవర్నర్ నర్సింహన్ ఇచ్చిన తేనీటి విందు లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తోపాటు రేవంత్ రెడ్డి , షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు . ఈ సందర్బంగా అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కరచాలనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ , రేవంత్ రెడ్డి ని చూసి చూడనట్లు ముందుకు వెళ్లగా , రేవంత్ రెడ్డి కూడా ఆయనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు .


 ఇక గవర్నర్ నర్సింహన్ , షబ్బీర్ అలీ , గవర్నర్ సతీమణి మధ్య ఆసక్తికరమైన , సరదా సంభాషణ కొనసాగింది . గవర్నర్ నర్సింహన్ రేవంత్ ను ఉద్దేశించి తేనీటి విందుకు వచ్చావో ... లేదోనని నీకోసం చూస్తున్నానని అన్నారు . మీరు ఆహ్వానించక రాకుండా ఎలా ఉంటాను సార్ అని రేవంత్ సమాధానం చెప్పారు . నన్ను కలవడానికి వస్తానని చెప్పి రాలేదు ఎందుకన్న గవర్నర్ ప్రశ్నకు మీరు కొడుతారేమోనని రాలేదన్నారు రేవంత్ . నేను మిమ్మల్ని కొట్టనా ... మీరు నన్ను కొట్టారా అంటూ గతం లో అసెంబ్లీ లో చోటు చేసుకున్న ఘటనను నర్సింహన్ గుర్తు చేశారు . అది మనస్సులో పెట్టుకుని ... మీరు కొడుతారేమోనని రాలేదని రేవంత్ చెప్పారు .


 పక్కనే ఉన్న షబ్బీర్ అలీ తోనూ గవర్నర్ మాట్లాడుతూ నాపై ఎందుకు కోపంగా ఉన్నారని ప్రశ్నించారు . రేవంత్ వారి మధ్యలో కలుగజేసుకుని ఆయన బిర్యానీ పెడుతారు తప్పిస్తే ఎవర్ని కోపగించుకోరని అన్నారు . పక్కనే ఉన్న గవర్నర్ సతీమణి జోక్యం చేసుకుంటూ ఆయన బిర్యానీ తినరు కదా అంటూ చమత్కరించారు .   


మరింత సమాచారం తెలుసుకోండి: