అన్న నందమూరి పేరు మీద చంద్రబాబు చేపట్టిన ఒకటి రెండు పధకాలు ఉన్నాయి. అందులో అయిదు రూపాయలకు రెండు పూటలా భోజన, టిఫిన్ స్కీం ఒకటి. ఇది అయిదేళ్ళ క్రితం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్ళు టైం పాస్ చేసి ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా 2018లో ప్రారంభించిన పధకం. అయితే చిరుద్యోగులు పేదలు ఇక్కడ భోజనం చేస్తున్నారన్నది కొంత నిజం.


అన్న క్యాంటీన్లకు మంగళం పాడాలని జగన్ సర్కార్ నిర్ణయించుకుందని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ నిజానికి ఆ ఆలోచన ఏదీ వైసీపీ సర్కార్ కి లేదని ఆ పార్టీ మంత్రులు అంటున్నారు. అన్న క్యాంటీన్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం చెల్లించక పోవడంతో ఆటోమాటిక్ గా  కాంట్రాక్ట్ జూలై 31తో రద్దు అయింది. ఇక జగన్ సర్కార్ అన్న క్యాంటీన్లకు కొనసాగించాలని నిర్ణయించుకుంది.


జగన్ అధికారుల సమావేశంలో మాట్లాడినపుడు కూడా క్యాంటీన్లను నాణ్యతా ప్రమాణాలతో చక్కగా నడపాలని సూచించారు. అవసరమైన చోట పెడితే అన్నార్తులకు అందుతుందని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపధ్యంలో పసుపు రంగుతో ఉన్న అన్న క్యాంటీన్లకు ఇపుడు తెల్ల సున్నం వేస్తున్నారు. అక్కడ చంద్రబాబు ఫోటోలు లేకుండా సున్నం  వేసేశారు.


ఇపుడు అన్న క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్లుగా మార్చడమే మిగిలింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాజన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి బొత్స ఇప్పటికే చెప్పారు. ఆ దిశగా పనులు సాగుతున్నాయని తెలుస్తోంది. మరి దీని కాంట్రాక్ట్ అక్షయ పాత్రకు ఇస్తారా లేక వేరే వారికి ఇస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా అన్న క్యాంటీన్లు నడుస్తాయన్నది తాజా వార్త. మరి అన్న క్యాంటీన్లను చక్కగా నిర్వహిస్తే అది జగన్ కే పేరు తెస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: