జనసేన పార్టీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. అయితే ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కనీసం ఎన్నికల మూడేళ్ళ నుంచైనా ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్లో స్పందించడం .. అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చి రావటం .. పోవటం చేస్తుండటంతో జనాలు పూర్తిగా జనసేనను విశ్వసించే పరిస్థితి రాలేదు. సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ .. వైసీపీ ముందు జనసేన నిలవలేక పోయింది. 


అయితే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలో తమ ఓటమికి కారణం ఏంటో తెలుసుకున్నంటున్నారు. అందుకే ఈ సారి క్షేత్ర  స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఫామ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన పార్టీ కమిటీలలో ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యత ఉండదని చెప్పుకొచ్చారు. అన్ని కులాల వారికీ అవకాశం ఉంటుంది. కేవలం కాపు కులాల వారిని నమ్ముకొని రాజకీయాల్లో రాలేదని పవన్ చెప్పుకొచ్చారు. 


అయితే చాలా మంది ఇప్పటికి ఆ పార్టీకి కాపు కులపు పార్టీ అని ముద్ర వేస్తుంటారు. దానికి కారణాలు లేకపోలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు .. భీమవరం .. గాజువాక రెండు కూడా కాపు ఓట్లు అధికంగా ఉన్న స్థానాలు. పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా ఆ కాపు ఓట్లు అధికంగా ఉన్న జిల్లాలలోనే జరిగింది. ఇటు రాయలసీమలో గాని .. గుంటూరు నుంచి నెల్లూరు వరకు పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రచారం చేసింది లేదు  .. అందుకే చాలా మంది జనసేన పార్టీకి కాపు కులాల మీద ఎక్కువ ఫోకస్ ఉందని కొంత మంది వాదిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: