ఆగస్టు 15, 1947 ఇండియాకు స్వాతంత్రం వచ్చింది.  దేశం యావత్తు పండుగ చేసుకుంటోంది.  ఇండియాకు స్వాతంత్రం తీసుకురావడంలో కృషి చేసిన మహాత్మా గాంధీ ఆరోజున ఎక్కడ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారో తెలుసా? తెలుసుకుందాం.  మహాత్మాగాంధీ 1920 వ సంవత్సరం ముందు వరకు దక్షిణాఫ్రికాలో ఉన్నారు.  



1920 వ సంవత్సరం నుంచి ఇండియాలో స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. అహింస వాదంతో ఆయన పోరాటం చేశారు.  గాంధీగారు అహింసావాదం పోరాటం కారణంగానే ఇండియాకు స్వాతంత్రం వచ్చింది.  ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజున మహాత్మాగాంధీ ఢిల్లీలో లేరు.  వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లో ఉన్నారు.  ఇండియాకు స్వాతంత్రం రాబోయే సమయంలో హిందూ.. ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈ గొడవలను నివారించేందుకు మహాత్మా గాంధీ బెంగాల్లోని నోవాఖలీలో నిరాహార దీక్ష చేస్తున్నారు.  



అయితే, ఆగస్టు 15 వ తేదీన ఇండియాకు స్వాతంత్రం వస్తుంది అని తెలుసుకున్న జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లు మహాత్మాగాంధీకి లేఖ రాశారు.  ఢిల్లీకి రావాలని కోరారు.  కానీ, మహాత్మాగాంధీ మాత్రం అందుకు అంగీకరించలేదు.  హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈ సమయంలో ఇక్కడి నుంచి రాలేనని చెప్పి తిరుగు ఉత్తరం రాశారు.  మతఘర్షణలు ఆగేవరకు రాలేనని చెప్పారు.  అంతేకాదు, అవసరమైతే తన తన ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఉత్తరం రాశారు.  



అనుకున్నట్టుగానే ఇండియాకు ఆగష్టు 15 వ తేదీ స్వాతంత్రం వచ్చింది.  ఆగస్టు 14 వ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే ఆగష్టు 15)  ఇప్పటి రాష్ట్రపతి భవన్ నుంచి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు.  ఈ చారిత్రాత్మక ప్రసంగాన్ని లక్షలాది మంది రేడియోల ద్వారా విన్నారు.  అప్పట్లో రేడియోనే ఆధారం.  కానీ, ఆ ప్రసంగాన్ని మహాత్మగాంధీ వినలేదు.  ఆరోజు రాత్రి 9 గంటలకే నిద్రపోయారట.  స్వాతంత్రం కోసం పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ లేకుండానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: