2019 ఎన్నికల్లో జగన్ విజయం ఒక సునామీ అని చెప్పాలి. ఏపీలో మొత్తం  175 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 151 స్థానాలను జగన్ కైవసం చేసుకున్నారు. దీనితో టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎన్నికల్లో గెలుపోటములు సహజం .. ఒకరు ఓడిపోతారు మరొకరు గెలుస్తారు అవన్నీ రాజకీయాల్లో సహజమే. అయితే రాజకీయాల్లో ఓడినా, గెలిచినా హుందా తనం పోగొట్టుకొకూడదు. అయితే ప్రతి సంవత్సరం గవర్నర్ నిర్వహించే అట్ హోం ప్రోగ్రామ్ కు అన్ని పార్టీల నేతలు వస్తారు. ఈ సారి కూడా ఆగష్టు 15న గవర్నర్ అందరికి ఆహ్వానం పంపించారు. మాములుగా ఇంతకు ముందు గవర్నర్ హైదరాబాద్ లో నిర్వహించేవారు. 


అయితే ఇప్పుడు కొత్త గవర్నర్ అమరావతిలోని ఉంటూ .. ఇక్కడే ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయం నేతలు అందరూ వచ్చారు. కమ్యూనిస్టులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ హాజరయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం హాజరు కాలేదు. బహుశా జగన్ ను సీఎంగా ఇప్పటికి కూడా చంద్రబాబు ఉహించుకోలేక పోతున్నారు. అందుకే జగన్ ముఖ్య మంత్రిగా ఉన్న ప్రోగామ్ కు రావటానికి మనసు ఒప్పలేదు. 


అయితే జగన్ ఇంతక ముందు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు హాజరు అయ్యేవారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా వెళ్లేవారు. చంద్రబాబుతో .. గవర్నర్ తో నవ్వుతు కనిపించేవారు. కానీ ఇప్పుడు పవన్ కూడా ఆఛాయలకు వెళ్ళలేదు. వీరు ఇప్పుడే కాదు జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. అయితే దీనితో కావాలనే వీరిద్దరూ హాజరు కాలేదని తెలిసి పోతుంది. అయితే  జగన్ మీద కోపంతో ఇటువంటి గౌరవ ప్రదమైన ప్రోగ్రామ్స్ కు హాజరు కాకకపోవటం ఎంత వరకు కరెక్ట్ అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: