రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేసి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నరసింహన్. మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి గవర్నర్ ను ఏర్పాటు చేయటంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణకు చెందిన ప్రముఖ నేతలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ గారు అందరితో కలిసిపోయే వ్యక్తి. నేతలకు నరసింహన్ గారు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. నేతలతో సరదా సంభాషణలు కూడా చేస్తారు నరసింహన్. ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య సరదా సంభాషణ జరిగింది. కార్యక్రమానికి వచ్చిన నేతలందరితో ఉత్సాహంగా చేతులు కలిపిన నరసింహన్ రేవంత్ రెడ్డి రాగానే ఆగిపోయారు. 
 
రేవంత్ రెడ్డి, నరసింహన్ మధ్య జరిగిన చర్చ నవ్వులు పూయించింది.గవర్నర్ రేవంత్ రెడ్డితో వచ్చావా! రాలేదేమోనని నీకోసమే చుట్టూ చూస్తున్నా అన్నారు. రేవంత్ రెడ్డి సమాధానంగా మీరు ఆహ్వానించాక రాకుండా ఉంటానా అని సమాధానం చెప్పాడు. నన్ను కలవటానికి వస్తానన్నారుగా? ఎందుకు రాలేదు అని గవర్నర్ అడగగా మీరు కొడతారేమోనని రాలేదని సరదాగా వ్యాఖ్యలు చేసారు రేవంత్ రెడ్డి. 
 
వెంటనే గవర్నర్ నేను కొట్టానా? మీరు నన్ను కొట్టారా? అని అన్నాడు. గతంలో అసెంబ్లీలో జరిగిన విషయం గుర్తు చేసుకొని గవర్నర్ ఈ వ్యాఖ్య చేయగా రేవంత్ అందుకే రాలేదు ఆ విషయాన్ని ఎక్కడ గుర్తు పెట్టుకొని కొడతారేమోనని అన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణతో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న నేతలందరూ ఒక్కసారిగా నవ్వేసారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: