మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత మరణం తరువాత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టాడు అన్నాడీఎంకే సీనియర్ నేత పళనిస్వామి.  అయితే ఆయన  పాలన ఫై ప్రజల్లో తీవ్ర  వ్యతిరేకత నెలకొంది.  ఈ విషయం సొంతంగా చెపుతుంది కాదు.  దేశంలో  ఏ ముఖ్యమంత్రి పనితీరుతో ఎంతమంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే అంశంపై  వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ 'దేశ్ కా మూడ్ పేరిట' ఓ  సర్వే నిర్వహించింది.  ఈజాబితాలో  సీఎం పళనిస్వామి 44పాయింట్లతో చివరి స్థానంలో  నిలిచారు. 


కాగా ఎన్నికల్లో గెలిచాక  ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో  కొన్ని  నెలలకే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని వ్యాఖ్యానించిన  ఏపీ  ముఖ్యమంత్రి   జగన్మోహన్ రెడ్డి..  ఇప్పుడు  ఆయన అన్నట్లే చేశారు.  ఎంతలా అంటే జగన్ కంటే ఎంతో సీనియర్ అయిన  తెలంగాణ రాష్ట్ర మఖ్యమంత్రి కేసీఆర్ ని దాటేసేదాకా...  వీడీపీ  సంస్థ విడుదల చేసిన  సర్వే ఫలితాల్లో ఉత్తమ  ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో  జగన్, కేసీఆర్ ను దాటేశాడు.  ఈ సర్వేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలవగా.. కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.  


ఈ జాబితాలో 81 పాయింట్ల తో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి మొదటి స్థానంలో నిలవగా.. 72 పాయింట్లతో ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి  యోగీ ఆదిత్యనాధ్ రెండో స్థానంలో నిలిచారు.   ఇక  ఏపీ ముఖ్యమంత్రి   గా బాధ్యతలు స్వీకరించనప్పటి నుండే  రాష్ట్ర ప్రక్షాళన విషయంలో  దూకుడుగా వ్యవహరించాడు వైఎస్ జగన్. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి జగన్ తీసుకుంటున్న  నిర్ణయాలు, చేపడుతున్న సంస్కరణలు ఆయనకు 3వ  స్థానం దక్కేలా చేశాయి. ఆగస్టు  9 నుంచి 14వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో  11వేల 252 మంది పాల్గొన్నారు. వీళ్లు చెప్పిన అభిప్రాయాల ఆధారంగా సర్వే ఫలితాల్ని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: