ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం   రివర్స్ టెండరింగ్ లో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు, జల విద్యుత్ కేంద్రానికి ఒకే టెండర్ పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పీపీఏ కి ఆదిత్య నాథ్ దాస్ సమాచారమిచ్చారు. ఇతర శాఖల్లోనూ రివర్స్ ను సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలవరం సాగు నీటి ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రాన్ని కలిపి ఒకే యూనిట్ గా శనివారం రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్ లను పిలవనుంది. విద్యుత్ కేంద్రానికి 3220.22 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల్లో మిగిలి పోయిన కాంక్రీటు పనులు గేట్ల తయారీ బిగింపు పనులకు కలిపి 1850 కోట్లు, మొత్తంగా 570.22 కోట్లకు టెండర్ లు పిలుస్తుంది. ఈ నెల 13న హైదరాబాద్ లో జరిగిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం వల్ల అంచనా వ్యయాలు పెరుగుతాయనీ లక్ష్యాన్ని చేధించడంలో జాప్యం జరుగుతుందని ముఖ్యంగా డ్యామ్ భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. వీటన్నింటిని దృష్టి ఉంచుకుని రివర్స్ టెండర్ ఆలోచనపై పునస్సమీక్షించుకోవాలని పీపీఏ సీఈవో ఆర్ కె జైన్ సూచించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం లోనిదే అయినప్పటికీ 70 శాతం పనులు పూర్తయ్యాక మిగిలిన 30 శాతం పనుల కోసం టెండర్ లను పిలిచేందుకు ఇది సరైన సమయమేనా అని పీపీఏ ప్రశ్నించింది.


సమావేశం మినిట్స్ ను ఇంకా పీపీఏ సిద్ధం చేయలేదు. ఈ మినిట్స్ వచ్చాకే పోలవరం టెండర్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించారు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించటంతో జల వనరుల శాఖ ఏపీ జెన్ కో అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్ కి సంభందించిన సంస్థలకు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు ప్రీక్లోజర్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులకు ఆ సంస్థల నుంచి సమాధానాలిచ్చాయి. తాము గతంలో చేసేందుకు అంగీకరించిన 387.56 కోట్లలో 5 శాతం డిస్కౌంట్ ఇచ్చి 368.19 కోట్లకు గేట్ల తయారీ బిగింపు పనులు చేపట్టేందుకు సిద్ధమేనని బెక్కం వెల్లడించింది. పోలవరం సాగు నీటి పనులలో మిగిలిన పనుల ధరలనే ఇంటర్నల్ బెంచ్ మార్క్ గా తీసుకున్నారు. విద్యుత్ ప్రాజెక్టుకు గతంలో పిలిచిన టెండర్ ద్వారానే ఐబీఎంగా తీసుకుని బిడ్ లను పిలుస్తున్నారు. సాగు నీటి ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రాలకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ కు వెళ్తున్నామంటూ పీపీఏ కి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ లేఖ రాశారు.


సంబంధిత పత్రాలన్నీ సిద్ధమైతే శుక్రవారమే టెండర్ లు పిలిచే అవకాశాలున్నాయని జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఇతర శాఖలకు కూడా రివర్స్ టెండరింగ్ లో బిడ్ లు పిలిచేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే జలవనరులశాఖ కేపీఎంజీ కన్సల్టెన్సీ ద్వారా రివర్స్ టెండర్ డాక్యుమెంట్ లను సిద్ధం చేయించింది. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు కాంట్రాక్టులపై అధ్యయనాన్ని తొందరగా తేల్చేయాలని శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని మంత్రులు శాఖాధిపతులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అవినీతి జరిగితే జరిగిందని లేదంటే జరగలేదని స్పష్టమైన నివేదికలు త్వరగా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ ఒక్కటే అన్ని శాఖలకు సంబంధించిన విషయాల పై లోతైన అధ్యయనం చేయడం కష్టమన్నారు. అందువల్ల శాఖలన్నీ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించుకుని సమగ్ర నివేదికలను ఇవ్వాలన్నారు. సంబంధిత విభాగాల్లో నిష్ణాతులు నివేదికలు ఇవ్వడం వల్ల వాటికి విశ్వసనీయత వస్తుందని చెప్పారు. దీంతో ఈ దిశగా ప్రధాన శాఖలు సిద్ధమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: