జగన్ పరిపాలనా ఎలా ఉందో మరో సారి ప్రజలు ఇచ్చిన  తీర్పులో బయట పడింది. అతి పిన్న వయసులో ఏపీ సీఎంగా భాద్యతలు తీసుకున్న జగన్ కనీసం 70 రోజులు పాలనా కూడా సరిగ్గా పూర్తి చేసుకోకుండానే దేశంలోనే నెం. 4 సీఎం అనిపించుకున్నారు. ఇది ఒక్క సర్వే చాలు జగన్ పరిపాలన పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారని, 70 రోజుల పరిపాలన పై ప్రతి పక్ష పార్టీలు పిచ్చి, పిచ్చి కూతలు కూసింది. కానీ జగన్ పరిపాలన ఎలా ఉందో సర్వే లో కూడా తేలిపోయింది. ఎంతలా అంటే పక్కనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా మించి పోయారు. జగన్ ప్రమాణ స్వీకారం రోజున 6 నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పారు. కానీ కేవలం 80 రోజుల లోపలే బెస్ట్ సీఎం అని ప్రజలు కితాబు ఇచ్చారు. 


జగన్ తక్కువ టైం లోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు. చాలా కీలక బిల్లులు అయిన ఉదాహరణకు వెనుకబడిన తరగతులకు నామినేటెడ్ పదవులకు 50 శాతం రిజర్వేషన్స్ అయితేనేం, అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కీలక సంస్కరణల కోసం కొత్త చట్టాన్ని తీసుకురావటం.. ఇవన్నీ పేద ప్రజలకు మేలు చేసేవి. 


అలాగే దేశంలో ఏ రాష్ట్రం భర్తీ చేయని విధంగా ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తున్నారు. లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి సుమారు 2 లక్షల 67 వేల ఉద్యోగాలు గ్రామీణ యువతకు అవకాశాలు కల్పించారు. ఇవే గాక ప్రభుత్వ ఉద్యోగాలు అయిన గ్రామ సచివాలయాలు సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు వదిలి ఔరా అనిపించారు. తన మ్యానిఫెస్టో లో చెప్పిన విధంగా జాబులకు నోటిఫికేషన్ ఇచ్చి త్వర త్వరగా రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇవన్నీ జగన్ కు బెస్ట్ సీఎం అని బిరుదును ఇస్తున్నాయని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: