ఏ విషయాన్నైనా డైవర్ట్ చేయటంలో తెలుగుదేశంపార్టీ నేతలకు మించిన వాళ్ళు లేరని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా చంద్రబాబునాయుడు ఇంటికి వరద ముప్పు విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కృష్ణానది వరద నీటిమట్టం పెరగట్టం వల్ల చంద్రబాబు నివాసం ముణిగిపోతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు ఇంటిపై ద్రోన్లతో చిత్రీకరించి దాడులకు కుట్ర జరుగుతోందంటూ ఒకటే గోల మొదలుపెట్టారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు ఇంటి దగ్గర ద్రోన్లతో చిత్రీకరించారట.  చిత్రికరణ సందర్భంగా  ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరిని చంద్రబాబు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అదే విషయాన్ని టిడిపి నేతలు టిడి జనార్ధన్, దేవినేని అవినాష్ లకు చెప్పారు. దాంతో ఆ విషయం మిగిలిన నేతలకు కూడా చేరింది.

 

ఇంకేముంది వెంటనే నేతలు దేవినేని ఉమ, ఆలపాటి రాజ, అశోక్ బాబు తదితరులు తమ మద్దతుదారులతో చంద్రబాబు ఇంటి దగ్గరకు వచ్చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు వచ్చి టిడిపి మద్దతుదారులను అడ్డుకున్నారు. వరద ముంపు పరిస్ధితులను తామే ద్రోన్లతో  చిత్రీకరిస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ చెప్పింది. అయితే చంద్రబాబు భద్రతపై కుట్ర జరుగుతోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

 

ద్రోన్లతో చంద్రబాబు ఇంటిని చిత్రీకరించిన ఇద్దరిని వెంటనే అరెస్టు చేయాలంటూ టిడిపి నేతలు పోలీసులనే నిర్బంధించారు. వాళ్ళిద్దరిని అరెస్టు చేయకుండా ఇక్కడి నుండి తీసుకెళ్ళేందుకు లేదంటూ మండిపోయారు. మొత్తానికి చంద్రబాబు ఇంటకి వరద ముప్పు విషయం పక్కకుపోయి చంద్రబాబు భద్రత విషయం హైలైట్ అవుతోంది. చంద్రబాబు కూడా తన నివాసాన్ని ద్రోన్లతో ఎలా చిత్రీకరిస్తారంటూ డిజిపి సవాంగ్ తో ఫోన్లతో మాట్లడారు. అదే సమయంలో వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇరిగేషన్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నేతలు డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: