ఇటీవలే భారీగా కురిసిన వర్షాలు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా విలపించాయి. వరుణుడు కరుణింనినా వరదలు వదలట్లేదు ఉగ్రరూపం దాల్చిన కృష్ణా నదితో ముంపు ప్రాంతాలు వణికిపోతున్నాయి. కృష్ణా నది ఉప్పొంగి ప్రవహించడం తోటి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పులిచింతల బ్యాక్ వాటర్ తో లోతట్టు ప్రాంతాలకు  ముంపుకు గురైయ్యాయి.

వీటికి తోడు ముంపు ప్రాంతాల్లో నిర్మించిన కరకట్టలోని లోపాలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల కాంట్రాక్టర్ల నిర్మాణ లోపం స్థానికులకు శాపంగా మారుతోంది. పులిచింతల వద్ద వరద తీవ్రత పెరగడంతో నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ముంపుకు గురైంది. ఆలయం ముంపు బారిన పడకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్ట నుంచి వరద నీరు లీకేజీ కావడంతో ఆలయంలోకి నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది.

దీంతో మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి అడుగు మేర కృష్ణా వరద నీరు చేరింది. పులిచింతల నిర్మాణం తర్వాత రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలకు ఆలయం మునిగిపోయింది. అపుడు ఆలయంలోంచి నీరు రాకుండా రెండుకోట్ల రూపాయలతో అప్పటి ప్రభుత్వం గోడను నిర్మించారు. అయితే ఆ గోడ లీకేజీలతో ఉండడం వల్ల ఆలయంలోకి నీరు ప్రవేశిస్తోంది. దీంతో ఆలయంలోకి భక్తులను అనుమతించకుండా  నిలిపివేశారు అర్చకులు.  గత మూడు రోజులుగా కరకట్ట నుంచి లీకేజీలు పగుళ్లు ద్వారా నీరు లోపలకి రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందికి గురైయ్యారు. ఈ రోజు ఉదయం గర్భాలయంలోకి కూడా నీరు చేరడంతో దొడ్డిగూడ ఆర్చకులకు నిత్య పూజలు నిర్వహించడం  కష్టంగా మారింది. ఉత్సవ విగ్రహం కూడా వేరే ఇతర ఆలయానికి తరలించడం వంటి పరిస్థితి వచ్చింది.


ముఖ్యంగా నలభై ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి పులిచింతల ప్రాజెక్టులో ఇప్పటికే నలభై టీఎంసీల నీటి నిల్వ చేస్తారు. దీంతో బ్యాక్ వాటర్ పెరగడం తోటే కృష్ణానది పొంగి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నాయి.ఈ సోమవారం ఆలయం పూర్తిగా ముంపు కు గురైంది నేపథ్యం కూడా పెట్టలేని పరిస్తితి. ఇది ఇలా కొనసాగితే ఆలయం పూర్తిగా నీట మునగడం ఖాయం అక్కడి ప్రజలు కావున ఇప్పటికైనా ప్రభుత్వం తగిన భద్రత చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: