ఏపిలో ఇప్పుడు డ్రోన్ల వ్యవహారం సంచలనంగా మారింది.  ఓ వైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు త్రీవ స్థాయిలో ఆందోళన చేపట్టారు.  తాజాగా  రాష్ట్ర రాజధాని అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక నివాసం వద్ద డ్రోన్ల వినియోగంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. వరదలు వస్తే చంద్రబాబు ఇల్లు మునుగుతుందని ముందే చెప్పాం. ప్రాజెక్టులు నిండటం టీడీపీ నేతలకు అస్సలు ఇష్టం లేదనిపిస్తుంది. టీడీపీ నేతలు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు.

గంట గంటలకు ప్రకాశం బ్యారేజ్ నీటీ మట్టం పెరిగిపోతుంది. అయినా దీన్ని పెద్ద వివాదంగా చేస్తున్నారే తప్ప అసలు విషయానికి వస్తే..మేం ముందే ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్ల లను వినియోగించామని అన్నారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. ఇదంతా వరద పరిస్థితులను అంచనా కోసమే వాడామని అన్నారు. వరద వస్తే కరకట్ట వద్ద ఉన్న మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నీట మునిగిపోతుందని ముందే చెప్పామని అయితే దాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం తాము చెప్పిందే నిజమని రుజువు అయ్యిందన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.  ఇకనైనా టీడీపీ నేతలు డ్రామాలు ఆపితే చాలా మంచిది అన్నారు.   


మేం ఏం చేయాలో అది చేసుకుంటూ పోతాం..ముంపు బాధితులను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని ఆయన స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రిగా జగన్ పదవిలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఒకేసారి నీళ్లు నింపి బాబు ఇంటి మీదకు వదిలారని చెబుతున్నారు. వరదల నిర్వహణ సరిగా తెలియదని మరికొంత మంది అంటున్నారు. శ్రీశైలం నిండాక ఒకేసారి వదిలితే 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేది.  చంద్రబాబు ఇల్లు ముంపు ప్రాంతంలో ఉంది..ఇది ఆయనకు ఆయన పార్టీ నాయకులకు తెలుసు.


అయినా కూడా కావాలనే తమపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా డ్రోన్ల సహాయంతో ముంపు పరిస్థితులను గత మూడు రోజుల నుంచి అంచనాలు వేస్తున్నాము..అది కూడా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ ఆదేశాలతోనే. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది..దానికోసం మా పని మేం చేసుకంటూ పోతామని అన్నారు మంత్రి అనీల్ కుమార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: