మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా అసలే ఓటమి భారాన్ని మూటగట్టుకున్న మాజీ మంత్రులకు పార్టీ హైకమాండ్ ప్రాధాన్యం తగ్గించడాన్ని వారి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.కొందరు సైలెంటయిపోయారు మరికొందరు భవిష్యత్తు కోసం వెతుకులాట సాగిస్తుంటారు. ఇంకొందరు తమ ఉనికి ని చాటుకునేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఇటీవల అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ ఎస్ నేతల పరిస్థితి. వారిలో కొందరికి పార్టీ హైకమాండ్ గుర్తింపు ఇవ్వకపోవడంతో ఫ్యూచర్ భయం పట్టుకుంది. అందుకే వారు తమ రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించి ఇంతకీ ఎవరా నేతలు వారి పరిస్థితి ఎలా ఉంది.


బండ్లు ఓడలు ఓడలు బండ్లు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఎవరు ఎప్పుడు వెలుగులోకొస్తారో ఎప్పుడు ఎవరు ఎలా కనుమరుగవుతారని తెలియని పరిస్థితి. పార్టీ అధిష్టానం ఒక్కోసారి ఒక్కరికీ ప్రాధాన్యం ఇస్తుంది అయితే రెండు వేల పధ్ధెనిమిది అసెంబ్లీ ఎన్నిక లు రెండు వేల పంతొమ్మిది లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన నేతల్లో చాలా మంది కనుమరుగయ్యారు. ఓడిన నియోజకవర్గాల్లో అక్కడ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు పార్టీ లోకి రావడం తో వీరి ప్రాధాన్యం పూర్తి గా తగ్గింది. దీంతో సదరు నేతలు సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు.


అలాంటి వారిలో చాలా మంది తమ సొంత పనులు చూసుకుంటున్నారని సమాచారం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన ఇంకొందరు నేతలేమో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోక్ సభ స్థానాల్లో ఓటమి పాలైన వినోద్ కుమార్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఇక మల్కాజిగిరి స్థానం లో ఓడిపోయిన మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఓడిపోయిన తలసాని సాయి కిరణ్ యాదవ్ వంటి వారు భవిష్యత్ రాజకీయాల పై దృష్టి సారించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో క్రియాశీలకం గా వ్యవహరిస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే లు వేముల వీరేశం బానోతు మదన్ లాల్ సైతం పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.


గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణా రావు ,చందూలాల్ వంటి వాళ్లు స్థబ్దుగా ఉన్నారు. వీరిలో తుమ్మల అడపాదడప పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్న జూపల్లి, చందూలాల్ మాత్రం పూర్తి గా సైలెంట్ అయిపోయారు వీరితో పాటు ఓడిపోయిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ గా అవకాశం వచ్చింది కానీ వీరికి మాత్రం మొండి చేయి చూపింది టీఆర్ ఎస్ అధిష్ఠానం.  కొందమంది మాజీ ఎమ్మెల్యే లకు జడ్పీ చైర్మన్ పదవుల ను కట్టబెట్టారు కెసీఆర్. ఇంకొందరు వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి, ఈ భావనతోనే ఏనుగు రవీందర్ రెడ్డి తీగల క్రిష్ణారెడ్డి జలగం, వెంకట్రవు పాయం, వెంకటేశ్వర్,లు తాటి వెంకటేశ్వర్లు వంటి నేతలు ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొన్న దాఖల లు లేవని  పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.



సదరు నేతల నియోజక వర్గాల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు అధికారం చెలాయిస్తుండడంతో వీరికి ఇబ్బందికరంగా మారిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకోందరి నేతలకైతే ఏకంగా  వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానాలూ కూడా వెంటాడుతున్నాయి. ఈ భయాందోళన లతోనే వారు తమ రాజకీయ భవిష్యత్ వెతుక్కునే పనిలో పడ్డార ని గులాబీ పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక మన కారు పార్టీ నేతలు జోరు ఎలా ఉండబోతోందో  వేచి చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: