జనసేన పార్టీని విలీనం చేయమంటూ ఓ పెద్ద పార్టీ పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తోందా ? తనపై వత్తిడి వస్తున్నట్లు స్వయంగా జనసేన అధినేత పవనే చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే. పార్టీ కార్యాలయంలో విజయవాడ పార్లమెంటు పరిధిలోని నేతలతో మాట్లాడుతూ తనపై సదరు పార్టీ ఎంత ఒత్తిడి తెచ్చినా విలీనం చేసే ప్రశక్తే లేదని తెగేసి చెప్పారు.

 

పవన్ మాటలు విన్న వారికి ఇక్కడే కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అసలు జనసేనను తమ పార్టీలో విలీనం చేయమని ఒత్తిడి తెస్తున్న ఆ పెద్ద పార్టీ ఏది ? పెద్ద పార్టీ అని పవన్ చెప్పారే కానీ ఆ పార్టీ ఏదో మాత్రం పవన్ చెప్పలేదు. అలాగే విలీనం గురించి పవన్ పై ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు ? అన్న విషయాలను మాత్రం చెప్పలేదు.

 

లాజికల్ గా చూస్తే జనసేనను విలీనం చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. చంద్రబాబునాయుడు విషయాన్నే తీసుకుంటే జనసేనను విలీనం చేసుకోవటం వల్ల టిడిపికి ఇపుడు వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. పైగా ఒకవేళ విలీనం జరిగితే టిడిపి నేతలకు, జనసేన  నేతలకు మధ్య గొడవలు జరగటమే తప్ప ఒరిగేది ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇక వైసిపి విషయానికి వస్తే పవన్ ను ఓ నేతగాను, జనసేనను ఓ రాజకీయ పార్టీగానే జగన్మోహన్ రెడ్డి ఏరోజూ  గుర్తించలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడే పవన్ ను గుర్తించని జగన్ ఇపుడు విలీనం గురించి ఎందుకు మాట్లాడుతారు. కాంగ్రెస్ సంగతి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.

 

ఫైలన్ గా మిగిలింది బిజెపి మాత్రమే. ఏదన్నా అవసరం అంటూ ఉంటే బిజెపికి మాత్రమే ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఓట్ల శాతం పరంగా చూస్తే రెండు పార్టీలకు కాస్త అటు ఇటుగా ఒకేలా వచ్చాయి. అలాగే జనసేనకు పార్టీ నిర్మాణమే లేదు. బిజెపికి ప్రజాకర్షక నేత లేరు. కాబట్టి రెండు పార్టీలు కలిస్తే బాగుంటుందని బిజెపి నాయకత్వం ఏమన్నా అనుకుంటోందేమో ? కాబట్టి జనసేనను విలీనం చేసుకుందామని బిజెపి నేతలు పవన్ తో మాట్లాడుండచ్చు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: