కృష్ణానది కి ఆనుకొని ఉన్న కరికట్ట ప్రాంతం వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా వరద నీటితో ప్రభావితమైంది. అయితే ప్రస్తుతం బాబు అతని ఇంటి లో కాకుండా హైదరాబాదులో ఉన్నారు.

దీనిపై స్పందిస్తూ మంగళగిరి శాసనసభ సభ్యులు ఆళ్ల రామకృష్ణ కొంచెం కొంటెగా చంద్రబాబు పై బాణాలు సంధించారు. ఆను చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు అక్రమ కట్టడంగా ఎప్పటినుంచో చెప్తున్నానని…వారు దానిని పట్టించుకోకపోవడం వల్ల చివరికి వరద నీరు వచ్చి ఆయన ఇంటికి ముంచే దాకా ఇల్లు వదిలి కదలలేదని ఆయన చమత్కరించారు. అలాగే బాబుకి వరద నీరు తన ఇంటిని తాకుతుందని ముందే తెలుసని అందుకే ఆయన ఇల్లు వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారని ఈ మంగళగిరి ఎమ్మెల్యే అన్నారు.

అయితే టిడిపి వర్గాలు మాత్రం రామకృష్ణ అన్న మాటలను కొట్టిపారేశారు. చంద్రబాబు గారి చెయ్యి ఒత్తిడికి గురికావడంతో కొద్దిగా గాయపడిందని అందుకోసమే ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు అని వారు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని టిడిపి జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కూడా ధృవీకరించారు. డాక్టర్లు బాబుని రెస్ట్ తీసుకోమని చెప్పడం వల్ల ఆయన హైదరాబాదులోని ఉండిపోయాడని లోకేష్ అన్నాడు.

ఈ మధ్యనే జరిగిన టిడిపి వర్క్ షాప్ లో కూడా చంద్రబాబు తన కుడి చేతికి బ్యాండేజ్ తో కనిపించారు. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీకి నివాళులర్పించే సమయంలో కూడా ఆయన చేతికి అదే బ్యాండేజ్ ఉంది. దీంతో బాబు నిజంగా చికిత్స నిమిత్తమే హైదరాబాద్ కు వెళ్లారు అని తెలుస్తుంది. 

బాధ్యతాయుతమైన అధికారపక్షానికి చెందిన ఆళ్ల రామకృష్ణ ఇలా ఎలాంటి నిజాలు తెలియకుండా మాట్లాడటం సబబు కాదు. ముందు వరదనీటి ముప్పు ఉన్న ప్రాంతాలకు చెందిన వారికి అవసరమైన కసరత్తులు చేపట్టకుండా ప్రతిపక్షం పై ఈ చమత్కారాలు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజానీకం.


మరింత సమాచారం తెలుసుకోండి: