కృష్ణమ్మకు వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. విజయవాడకి అత్యంత సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర, పవిత్ర సంగమం దగ్గర ప్రస్తుతం బాగా వరద ముంచుకు వచ్చింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ సమీపంలో వందలాది ఇళ్లు నీట మునిగాయి. జనాలందరూ సామాన్లను బయటకు తెచ్చుకుని రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. ఒక్క సారిగా వచ్చిన వరద నీటితో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర చాలా పెద్ద ఎత్తున కృష్ణా వరద నీరు చేరింది. లంక లోపల ఉన్న గొర్రెలన్నింటినీ కూడా  బోట్లలో తీసుకొచ్చి వాటన్నింటిని కూడా కాపాడే ప్రయత్నాలు చేస్తూన్నారు. లంకలో ఉన్నటువంటి జనాలందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులు వారి బోట్లలో లంక గ్రామాలకు వెళ్ళి వారికి తగిన సహయం చేస్తున్నారు . పోలీసులు కూడా కొన్ని ప్రత్యేకమైన బోట్లు ఏర్పాటు చేశారు.


ఇబ్రహీంపట్నం ఫెర్రీ చుట్టు పక్కల ఉన్న అనేక ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఆ పరిస్థితుల్లో ముందు జనాలకు  జంతువులకు ఎలాంటి ప్రాణానికి ఇబ్బంది లేకుండా పోలీసులంతా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కొంతమంది పశువుల కాపరులు, గొర్రెల కాపరులు లోపల చిక్కుకు పోతే వాళ్ళని కూడా కొద్ది సేపటి క్రితమే పునరావాస కేంద్రానికి తీసుకువచ్చారు.మొత్తం జలమయమైపోయి చెట్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఊరు మధ్యలో బోట్లు వేసుకుని తీరిగే పరిస్తితి నెలకొంది. మత్స్యకారులందరూ కూడా కృష్ణా నదిలో ఉన్న బోట్లన్నింటిని కూడా తీసుకువచ్చి వేరే ఒడ్డున పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫెర్రీ ఘాట్ లో ఒక దేవాలయం కూడా సగం వరకు నీట మునిగిపోయింది. నదిలో ఉండాల్సిన బోట్లన్ని ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చేశాయి. కొన్ని వందల బోట్లను ఇక్కడ రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఇక్కడ పవిత్ర సంగమం ఘాట్ అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఉంది.


దాదాపు మోకాలి లోతు నీళ్లు ప్రస్తుతం పవిత్ర సంగమం ఘాట్ లోకి విపరీతంగా చొచ్చుకు వచ్చేశాయి. ఉగ్ర రూపంతో కృష్ణానది ప్రవహిస్తూ ఉండటంతో అంతకంతకూ వరద నీరు పెరుగుతుండటంతో చుట్టు పక్కల గ్రామాలన్నిటిని కూడా నీట మునుగుతున్నాయి. కోంచం సేపు తరువాత ఎత్తు ప్రదేశంలో ఉన్న ఇళ్ల లోపలకి కూడా నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం వస్తున్న వరద నీరు అంతటినీ కూడా చూడటానికి జనాలందరూ కూడా ఈ పవిత్ర సంగమం ఫెర్రీ దగ్గరకి వస్తూన్నారు. వరద నీటిని చూసి వాళ్లంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అంతకంతకూ లోపలికి చొచ్చుకు వస్తున్న వరద నీటిని చూసిన వాళ్ళందరూ భయాందోళన చెందుతున్నారు.  ఇప్పటికే అధికారులు చాలామందిని ఇళ్లు ఖాళీ చేయించి ఒడ్డుకు తీసుకువచ్చారు. వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండ్రోజుల పాటు కూడా ఇదే విధంగా వరద నీరు ఉండడం వల్ల పునరావాస కేంద్రాలల్లోనే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు


మరింత సమాచారం తెలుసుకోండి: