టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు అనిపించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి, కనీసం మూడునెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రతి విషయంలో నానా యాగీ చేస్తున్నారు. నిజానికి టీడీపీ ఆపార్టీకి ఉన్న వీక్ నెస్ అది. అయిన దానికి కాని దానికి బోడి గుండెకు .. మోకాళ్ళకు ముడి పెట్టడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు ఏమో ఒక పక్క నాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా కల్పించడం లేదని కోర్ట్ కు వెళతారు. ప్రభుత్వం .. చంద్రబాబు ఇల్లుకు భద్రతా కల్పించే ఉద్దేశంతో డ్రోన్లను ఉపయోగిస్తే, దానిని కూడా రాజకీయం చేయడం ఒక్క చంద్రబాబుకే దక్కింది. 


అయితే కృష్ణ నదికి అనుకున్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. నది పరివాహక ప్రాంతం అయినా లింగమనేని గెస్ట్ హౌస్ చట్ట విరుద్ధమని, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ కూడా లేఖలో పొందు పరిచింది. అందుకే చంద్రబాబు నివాసానికి అనుకుని ఉన్న ప్రజా వేదికను జగన్ సర్కార్ కూల్చి పడేశారు. అయితే ఇప్పుడు వర్షాలతో, వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. దీనితో చంద్రబాబు నివాసానికి ముంపు వచ్చింది.


చంద్రబాబు కూడా అక్కడ ఉండలేక హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. వరదను ఆపడానికి ఇసుక బస్తాలను మోహరించిన పరిస్థితి. అయితే వరద ముప్పుతో ఉన్న చంద్రబాబు ఇల్లును డ్రోన్లతో నిఘాలో పెట్టడమే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పు. సాధారణ ప్రజలను ఎలాగైతే కాపాడాలో.. రాష్ట్ర ప్రతి పక్ష నేత అయిన చంద్రబాబును అలాగే కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిది. కానీ దానిని కూడా తప్పు అనే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులూ. 


మరింత సమాచారం తెలుసుకోండి: