బీజేపీ పార్టీ దక్షిణాన పాగావేయాలని చాలా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ను మట్టి కరిపించిన బీజేపీ ఇప్పుడు దాని కన్ను రెండు తెలుగు రాష్ట్రాల మీద పడింది. కేంద్రం స్థాయిలో మోడీ హవాతో దేశం మొత్తం స్వీప్ చేసింది. దీనితో కేంద్రంలో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. అయితే అన్ని రాష్ట్రాల్లో చివరికి సౌత్ లోని కర్ణాటకలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనిపించినా ఏపీ లో మాత్రం లేదు. జగన్ .. 30 ఏళ్ల టీడీపీని మట్టికరిపించి 25 పార్లమెంట్ స్థానాల్లో ఏకంగా 22 స్థానాలు గెలుచుకొని సరికొత్త సునామీని సృష్టించారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది.


దీనితో తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని దృడంగా నిశ్చయించుకుంది. అమిత్ షా కూడా తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ చేశారు. ఈ మధ్యే తెలంగాణ నేతలతో భేటీ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. మీ వల్ల కాకపోతే చెప్పండి నేను రంగంలోకి దిగుతానని .. ఈ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. బీజేపీ తెర వెనుక ఎటువంటి ప్లాన్ తో ఉందో .. అయితే టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాన మొదట కేసీఆర్ సర్కార్ ను .. తరువాత జగన్ సర్కార్ ను కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందని బాంబు పేల్చారు. 


ఇక్కడ తెలంగాణ .. ఏపీ ప్రభుత్వాలను కూల దోయడం అంటే అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను బీజేపీలోకి రంపించడమో .. లేదా రాష్ట్రాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకోవటమే నని చెప్పాలి. అయితే ఇప్పటీకే తెలంగాణ లో బీజేపీ దండయాత్ర మొదలైందని చెప్పాలి. తెలంగాణలో తెరాస కు తామే ప్రధాన ప్రతి పక్షమని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనితో తెరాస లో ఎక్కడ లేని ఒణుకు మొదలైంది. ఎందుకంటే తెరాస పార్టీకి కాంగ్రెస్ ను ఎదుర్కోవటం సులభం గాని బీజేపీ లాంటి పార్టీని ఎదుర్కోవటం అంత సులభం కాదు. పైకి తెరాస నేతలు గంభీరంగా మాట్లాడుతున్న వారి మాటల్లోనే అర్ధం అవుతుంది. బీజేపీ ఎంతలా తమను డామేజ్ చేయగలడో ! 

మరింత సమాచారం తెలుసుకోండి: