పసిప్రాణాలకు ఏం తెలుసు తమనేస్తాలను వదిలి వెళ్లవలసి వస్తుందని.మరికొన్ని గంటల్లో స్వాతంత్రదినోత్సవ వేడుకలు జరుపుకునే మన భారతదేశంలో తమ ఉనికి మాయం అవుతుందని, కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చే యమపాశం తమను తీసుకెళుతుందని. ఇంత అత్యంత విషాదం చోటుచేసుకున్న సంఘటన జరిగిన ప్రదేశం ప్రకాశం జిల్లా..  వివరాల్లోకి వెళ్ళితే,


సంతమాగులూరు మండలం కొప్పవరంలోని కోదండరామస్వామి ఆలయం వద్ద స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు చిన్నారులు జెండా దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే ఆ జెండా పోల్ కు పైన విద్యుత్ తీగలు తగలటంతో పోల్ దగ్గర ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు విద్యుత్ షాక్ తో మృత్యువాతపడ్డారు. ఇటీవలి వర్షాలకు ఆ జెండాపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ విషయం గమనించని ముగ్గురు విద్యార్థులు ఆడుకుంటూ జెండా దగ్గరికి వచ్చి స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది.దీంతో ముగ్గురూ పసివాళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు...


కోదండరామస్వామి వారి ఆలయ ప్రధాన కూడలిలో చోటు చేసుకున్న ఈ ఘటనతో మూడు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి.చనిపోయిన ముగ్గురు విద్యార్థులు ఐదవ తరగతి చదివే 11 ఏళ్ల వయసున్న షేక్ పఠాన్‌ గౌస్, షేక్‌ హసన్‌ బుడే, పఠాన్‌ అమర్‌ అని స్దానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు... 



అనుకోకుండ జరిగిన ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ అధికారుల అంటే ఇక్కడిప్రజలు అవునంటున్నారు.భాద్యులు ఎవరైన పోయిన ప్రాణాలు తిరిగిరావు,మన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్నిప్రాణాలు గాల్లోకలసిన అప్రమత్తంగా వుండరు. మరి ఈ సంఘటనపట్ల  ఆ రాష్ట్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ప్రమాదానికి కారణమైన వారిపట్ల కఠినంగా స్పందించి ఎలాంటిచర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: