మోడీ ఆలోచనలు బాగున్నాయి -  చిదంబరం

మన ప్రధానమంత్రి ఇ శ్రీ నరేంద్రమోడీ అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని  మాజీ ఆర్థిక మంత్రి శ్రీ పి చిదంబరం అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై 73వ స్వాతంత్ర  దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుందని,  ఆర్థికపరమైన ప్రతిపాదనలు అద్భుతంగా ఉన్నాయని శ్రీ నరేంద్రమోడీ వాటిని సాధించే దిశగా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నట్టు శ్రీ పి చిదంబరం చెప్పారు.

శ్రీ నరేంద్ర మోదీమోదీ చెప్పిన విషయాలలో జనాభా పెరుగుదల ద్వారా జరగబోయే నష్టం,  భవిష్యత్తు తరాల పాట్లు, ప్లాస్టిక్ మహమ్మారిని పారద్రోలడం, మనదేశంలో సంపదను సృష్టించుకోవడం వంటివి అద్భుతమైన ఆలోచన అని అవి కార్యరూపం దాలిస్తే   మన దేశ పురోభివృద్ధి ఆకాశమే హద్దుగా ఎవరికి అందనంత ఎత్తుకు చేరుకుంటుందని శ్రీ చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు.

జనాభా పెరుగుదల విషయంలో ప్రజలంతా ముందుకొచ్చి సహకరిస్తే ఆ లక్ష్యాన్ని మనం చక్కగా మరియు త్వరగా చేరుకోవచ్చని చెప్పారు.   చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న మన పూర్వీకులు చెప్పిన మాటలు మోదీ మళ్లీ జ్ఞప్తికి తెచ్చారని, చిన్న కుటుంబాలు దేశానికి శ్రీరామరక్ష అని శ్రీ చిదంబరం అన్నారు.

 అంతకంతకూ పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం తగదన్నారు.   ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి వేయాలన్న మోదీ ఆలోచన ప్రశంసార్హం అయినదని కొనియాడారు.  ఈ ప్లాస్టిక్ వాడకంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, దానిని వాడడం మానేస్తే దేశంలో  చాలా రకాలైన అనారోగ్య సమస్యల నుంచి పేద ప్రజలు బయటపడవచ్చు అన్నారు. 

ఇక దేశంలో సంపద సృష్టించేవారు గురించి మాట్లాడుతూ వారిని తప్పనిసరిగా గౌరవించాలని మోదీ చెప్పిన మాట అక్షర సత్యమని,  దానిద్వారా మనదేశంలో పేదరికాన్ని నిర్మూలించవచ్చని శ్రీ చిదంబరం అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: