తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఉత్వర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కేబినేట్ హోదా కలిగి ఉంటారు. క్యాబినేట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వనితుడిగా ఉంటారు.

 

ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు కుడిభుజంగా వినోద్ వ్య‌వ‌హ‌రించారు. 2004లో హన్మకొండ లోక్‌సభ స్థానం, 2014లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన వినోద్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట‌మి పాల‌య్యారు. కరీంనగర్ నుంచి పోటీ చేసిన వినోద్‌ను గెలిపిస్తే...కేంద్ర మంత్రి కూడా అవుతారంటూ సీఎం కేసీఆర్ ప్రకటించ‌గా ఆయ‌న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే త‌న‌కు స‌న్నిహితుడైన వినోద్‌కు కేసీఆర్ కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌నే జోస్యం వ్య‌క్త‌మైంది. దాన్ని నిజం చేస్తూ తాజాగా ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించారు.

 

రాష్ట్ర అధివృద్దికి సంబందించిన అంశాల్లో ప్రణాళిక సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్జుడైన వినోద్ కుమార్ ను ఈ సంఘనికి నియమించార‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. 2019-20 అర్ధిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నానేపథ్యంలో అన్ని శాఖలకు సంబందించిన వ్య‌వ‌హారాలను సమీక్షించి,  ప్రతిపాదనలు తయారు చేసే కీలక పనినిని ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడిగా వ్వవహరించే వినోద్ కుమార్‌కు కేసీఆర్ అప్పగించార‌న్నారు. కాగా, వినోద్ కుమార్ కు ఈ పదవికి 3ఏళ్లు కొనసాగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: