టీఆర్‌ఎస్‌, బీజేపీని కార్నర్ చేస్తూ... కొత్త నినాదాన్ని ఎంచుకోబోతోంది కాంగ్రెస్‌. ఎన్నో ఏళ్లుగా రగులుతున్న ఆ సెంటిమెంట్‌ను.. తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది. సెప్టెంబర్‌ 17.. తెలంగాణకు చాలా ప్రత్యేకమైన రోజు. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం పాలన అంతమై...భారత్‌లో కలిసింది హైదరాబాద్‌ సంస్థానం. ఐతే.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ... ఏ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించిదీ లేదు. ప్రభుత్వంలో ఎవరున్నా... అధికారికంగా జెండా కూడా ఎగరేయలేదు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే బీజేపీ.. టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయగా... కాంగ్రెస్‌ కూడా అదే నినాదాన్ని అందుకోబోతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్తూ... ఒత్తిడి పెంచాలని డిసైడయ్యింది కాంగ్రెస్‌ పార్టీ. 

ఆగస్ట్ 15న గాంధీ భవన్‌లో జాతీయ జెండాని ఎగురేసిన తరువాత.. ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ లాంటి సీనియర్ నాయకులంతా సెప్టంబర్ 17 పై చర్చించారు. స్వరాష్ట్రంలో కూడా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం సరైందీ కాదనే భావనకు వచ్చారు. ఎంఐఎం మెప్పు కోసమే కేసీఆర్‌... అధికారికంగా నిర్వహించడం లేదని, దీనిపై పోరాటం చేయాలని డిసైడయ్యారు నేతలు. ఇటు టీఆర్‌ఎస్‌, అటు బీజేపీని కూడా ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు.

ఐతే.. టీఆర్‌ఎస్‌ నుంచి కౌంటర్‌ వస్తే... ఉద్యమం సమయంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారు. అంతేకాదు... అధికారికంగా నిర్వహిస్తే వచ్చే ఇబ్బంది ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేయనున్నారు. టీఆర్ఎస్ అధికారికంగా నిర్వహించకపోతే.... కేంద్రం నేరుగా నిర్ఱయం తీసుకోవచ్చు కదా..? అనే అంశాన్ని ప్రస్తావించాలనుకుంటుంది కాంగ్రెస్‌. ఐతే.. సెప్టెంబర్ 17 విషయంలో ఎలాంటి ఎత్తుగడను అవలంభించాలనే దానిపై మరికొంత చర్చించి కార్యాచరణను రూపొందించుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎలాగు ఎంఐఎంతో తమకు మిత్రుత్వం అయితే లేదు కాబట్టి... ఎజెండాను ఎంచుకోవటమే ఉత్తమం అనే భావన కూడా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 










మరింత సమాచారం తెలుసుకోండి: