గురువు మారలేదు

 భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి  మళ్లీ నియమితుడయ్యాడు. దీని ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ  ఆకాంక్ష నెరవేరింది. రవిశాస్త్రిమరియు విరాట్ కోహ్లీ ల మధ్య అద్భుత సమయం ఉండడం జట్టు సభ్యులందరూ రవి శాస్త్రి   కోచ్ గా కావాలని కోరుకోవడం కూడా ఆయనను మళ్ళీ కోచ్గా నియమించడానికి మార్గం సుగమం అయినట్లు ఉన్నది.

 మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్,  అన్షుమన్‌ గైక్వాడ్ మరియు శాంతా రంగస్వామి లతో కూడిన కమిటీ భారత క్రికెట్ జట్టుకు కోచ్ ఎంపిక చేయటానికి ఈరోజు సమావేశమైంది.రవి శాస్త్రి కాక ఇంకా   రాబిన్ సింగ్ లాల్చంద్ రాజ్పుత్, వెస్టిండీస్కు చెందిన న ఫీల్ symons, ఆస్ట్రేలియా వాసి టామ్ మోడీ, తదితరులు ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ,  చివరగా అందరి మద్దతు పుష్కలంగా ఉన్నా అనుభవజ్ఞుడైన రవి శాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్గా మళ్లీ నియమించబడ్డాడు.  

రవిశాస్త్రి శిష్యరికంలో టీమిండియా ఆస్ట్రేలియాలో  జరిగిన పోటీలలో అద్భుత విజయాలు నమోదు చేసింది. గత ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్ వరకు దూసుకు వెళ్ళిన మన జట్టు,  హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన సంగతి అందరికీ తెలిసినదే. సెమీ ఫైనల్ వరకు ఓటమి అన్నది లేకుండా టీమిండియా ప్రయాణించిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.   ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మళ్లీ రవి శాస్త్రి హెడ్ కోచ్ గా నియమించారని తెలుస్తోంది.

 ఏది ఏమైనా క్రికెట్ ఒక మతం గా భావించి, క్రికెట్   కోసం దేన్నైనా త్యాగం చేసే మన భారతీయుల కు చివర గా కావలసింది భారత జట్టు విజయం  అనేది సుస్పష్టం. మళ్లీ రవిశాస్త్రి నియామకంతో మన జట్టు అద్భుత ప్రతిభను కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని  కోరుకుందాం.



మరింత సమాచారం తెలుసుకోండి: