Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:43 pm IST

Menu &Sections

Search

హైదరాబాద్‌లో కాస్ట్‌లీ ఏరియా ఏదో తెలుసా... టాప్ -10 లిస్టు ఇదే

హైదరాబాద్‌లో కాస్ట్‌లీ ఏరియా ఏదో తెలుసా... టాప్ -10 లిస్టు ఇదే
హైదరాబాద్‌లో కాస్ట్‌లీ ఏరియా ఏదో తెలుసా... టాప్ -10 లిస్టు ఇదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన అక్కడ ఇంటి అద్దెలు సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి. నగరంలో లోపలి ప్రాంతం అయితే డబుల్ బెడ్ రూమ్ 7 నుంచి 12 వేలు లోపు దొరికేస్తాయి. కొంచెం జాతీయ రహదారులకు దగ్గర ప్రాంతాలు అయితే డబుల్ బెడ్ రూమ్ 10 వేల నుంచి 15 వేల వరకు ఉంటుంది. కానీ నగరంలో ఓ ఏరియాలో మాత్రం ఈ రేట్లలో ఇల్లు అద్దె దొరకవు. సుమారు ఇక్కడ రూ.25 వేలపైనే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అది సినీ, రాజకీయ,వ్యాపార ప్రముఖులు, వీవీఐపీలు ఉండే ప్రాంతం. 


అంత కాస్ట్లీ ఏరియా ఏదో కాదు 'బజారాహిల్స్' దీనికి కొంచెం తక్కువలో జూబ్లీహిల్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో ‘అనరాక్‌ ప్రాపర్టీస్‌’ సంస్థ చేపట్టిన ఖరీదైన ప్రాంతాల సర్వేలో బంజారాహిల్స్‌ టాప్‌లో నిలవగా జూబ్లీహిల్స్‌ రెండో స్థానంలో నిలిచింది. నగరంలో బాగా డబ్బున్నవారు నివసించే ఈ రెండు ప్రాంతాలు ఖరీదైన నివాస ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. గత రికార్డులని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా టాప్ లో నిలిచాయి. ముఖ్యంగా ఇంటి అద్దె విషయంలో కొన్ని దశాబ్దాలుగా టాప్ లో ఉంటూనే వస్తున్నాయి. వీటి తర్వాత హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, బేగంపేట్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగి, మియాపూర్, ఎల్బీనగర్‌ ప్రాంతాలు టాప్‌ టెన్‌ స్థానాల్లో నిలిచాయి. 


ప్రధానంగా అనరాక్ ప్రాపర్టీస్ సంస్థ ఆయా ప్రాంతాల్లో సరాసరిన 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల అద్దెలను ప్రామాణికంగా తీసుకొని సర్వే చేసింది. ఆయా ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే ఇంటి అద్దెలు సరాసరి 9 శాతానికి పైగానే పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ టాప్ లో ఉండటానికి ప్రధాన కారణం, ఈ ప్రాంతాల్లో సినీ, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ముఖ్యులు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండటం. అలాగే ఈ ప్రాంతాల్లో సువిశాల ప్రాంగణాల్లో అత్యాధునిక వసతులున్న భవనాలు అందుబాటులో ఉండటం.


పైగా ఈ ప్రాంతాల్లోనే బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్, ఐటీ, బీపీఓ, కేపీఓ, బీమా, ఫార్మా ఇతర వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన కార్పొరేట్‌ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇళ్ల అద్దె అమాంతం పెరగుతోంది. వీటికి తోడు మల్టీప్లెక్సులు, పబ్స్, షాపింగ్ మాల్స్, బార్లు, అత్యాధునిక సదుపాయాలు గల హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నాయి. వీటితోపాటు చాలా రకాల వసతులు ఉండటం వల్లే బజారాహిల్స్, జూబ్లీహిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా ఉన్నాయి. 



costly-areas-in-hyderabad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్‌పై క‌మ‌లం స‌రికొత్త అస్త్రం.... స‌క్సెస్ అయ్యేనా..
వామ్మో... న‌య‌న‌తార రెమ్యున‌రేష‌న్ అంతా...
ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి అవుట్ ఎరంటే...
కోడెల మృతిపై బాబోరి స‌రికొత్త రాజ‌కీయం..
హుజూర్‌నగర్‌ టికెట్: టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఫైటింగ్..
ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీ ఎంట్రీ ఎందుకు ఆగింది... ఈ స‌స్పెన్స్ ఏంటి..!
ఆ జిల్లాలో టీడీపీ ఖేల్ ఖ‌తం... దుకాణం బంద్‌..!
ఏపీలో టీడీపీ మరో రెండు చోట్ల ఖాళీ... ఖాళీ...!
వైసీపీలో కోల్డ్ వార్... మంత్రికి వార్నింగ్ వచ్చిందా..!
సుచ‌రిత హోం మంత్రిగా స‌క్సెస్ అయ్యారా... సీనియ‌ర్ల‌కే షాక్ ఇచ్చారా...!
తోట‌కు జ‌గ‌న్ భారీ ఆఫ‌ర్‌... షాకింగ్ టార్గెట్‌...!
ఆ ఒక్క ప‌థ‌కానికే 560 కోట్లు.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..
ఆరోగ్య శ్రీ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు... వైద్య చ‌రిత్ర‌లోనే రికార్డు
ఆ స్టార్ హీరోయిన్‌కు హీరోయిన్లే కావాల‌ట‌.. వారితోనే అన్ని
ప‌వ‌న్‌ను మ‌నం హీరోను చేయ‌డం ఏంటి... ఆ పార్టీ నేత‌ల ఫైర్‌..!
ఏపీలో మ‌రో తెలంగాణ ప‌థ‌కం..
ఆ ఎన్నికల‌ పేరెత్తితేనే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ ఎందుకు..?
మంత్రిగా అనిల్ ఆరంగ్రేటం ఎలా ఉంది... హిట్టా... ఫ‌ట్టా..!
ఆ ప‌త్రిక అత్యుత్సాహం.. జ‌గ‌న్‌తో ర‌గ‌డ వెన‌క అస‌లు గుట్టు ఇదే...
టీడీపీలో ఆ ముగ్గురు నేతల అడ్రెస్ ఎక్కడ..!
ప్ర‌మాదం ఒక్క‌టే.,. కానీ, పాలకుల కోణంలోనే తేడా..!
డిగ్గీరాజా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌: దేశంలో అత్యాచారాల‌కు వాళ్లే కార‌ణం.
టాలీవుడ్ టాప్ హిట్స్‌: ఫ‌స్ట్ వీక్ బాక్స్ బ‌ద్ద‌లు కొట్టిన సినిమాలు
టీడీపీ ప‌రువు తీస్తోందెవ‌రు...!
' వాల్మీకి ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. వ‌రుణ్ టార్గెట్ ఎంతంటే...
' గ్యాంగ్ లీడ‌ర్ ' 4 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ట్రేడ్‌లో టెన్ష‌న్ స్టార్ట్‌
బ్రేకింగ్‌: టీటీడీ పాల‌క‌మండలి ఖరారు.. న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఛాన్స్‌
బీజేపీతో శివ‌సేన బ్రేక‌ప్‌... మా దారి మాదే..!
' కోడెల‌కు బాబు నో అపాయింట్‌మెంట్‌ '
బీజేపీలోకి మాజీ మంత్రి... ఆ పార్టీకి మ‌రో షాక్‌..
టీడీపీ మాఫియాకు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే స‌పోర్ట్‌..!
మ‌హారాష్ట్ర‌లో కుదిరిన పొత్తు... సీట్ల డీల్ ఇదే
ఆ తెలంగాణ ఫైర్‌బ్రాండ్ చూపు క‌మ‌లం వైపు..?
కోడెల మరణంతోనైనా... ఆ నేతలకు జ్ఞానోదయం అవుతుందా..!
టీడీపీ త‌మ్ముళ్ల‌ రీచార్జ్ ... ఈ ఉత్సాహం వెన‌క రీజ‌న్ ఇదే..!
మంత్రిగా పేర్ని నానికి ఎన్ని మార్కులు... స‌క్సెస్ అయిన‌ట్టేనా..!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.