జగన్ ప్రభుత్వం పోలవరం విషయంలో కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ కంపెనీను రద్దు చేసిన సంగతీ తెలిసిందే. పోలవరంలో పెద్ద అవినీతి జరిగిందని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ పలు సార్లు చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి పోలవరంలో జరిగిన అవకతవకలు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరంలో జరిగిన అవినీతి పై ఒక కమిటీని కూడా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం పనులు నిలిపేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నిర్మాణాన్ని చేపట్టిన నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఇచ్చినట్టు సమాచారం.


నిజానికి ఈ కంపెనీ పనులు చేపట్టక ముందు టీడీపీ ఎంపీకి సంధించిన ట్రాన్స్ రాయ్ కంపెనీ నిర్మాణం చేపట్టింది. కానీ కొన్నేళ్ళకు రాష్ట్రం ఇచ్చిన బడ్జెట్ లో ప్రాజెక్టు ను పూర్తి చేయలేమని చెప్పి తప్పుకుంది. తరువాత వచ్చిన నవయుగ కంపెనీ ప్రాజెక్ట్ వ్యయం కంటే 14 శాతం తక్కువకే పూర్తి చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఈ కంపెనీకి పోలవరం పనులను అప్పగించింది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు ఈ కంపెనీని తప్పుకోమని ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ జారీ చేసింది.


అయితే ఈ నిర్ణయం పట్ల కొంత మంది ఆందోళను వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలవరం పనులు ఎట్టి పరిస్థితిలో లేటు కాకూడదని జగన్ ప్రభుత్వం వెంటనే టెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ప్రభుత్వం కోట్ చేసిన ధర కంటే తక్కువలో ఏ కంపెనీ అయినా ముందుకు వస్తే ఆ కంపెనీకి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే మళ్ళీ నవయుగ కంపెనీ కూడా ఆక్షన్ లో పాల్గొనవచ్చని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అయితే ఏ కంపెనీ తీసుకున్న పర్వాలేదు .. ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గితే చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అన్ని వనరులతో నవయుగ కంపెనీ  సిద్ధంగా ఉంది కాబట్టి ఆ కంపెనీకి మళ్ళీ అవకాశం రావొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: