నేటిసమాజంలో ఎక్కడ విన్నా ఆడపిల్లలపై అత్యాచారాలనే పదం కామనైపోయింది.కామాందులు ఐతే అదో ఘనకార్యంగా భావిస్తున్నారు.ఎన్నిచట్టాలు వచ్చిన చుట్టాల్లాగ వుంటున్నాయేతప్ప ఒక్కడి ఒంట్లో భయాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాయి..నమ్మినవారిని,నట్టేట ముంచేవారు కొందరైతే, బసుల్లో,రైల్వే స్టేషన్ ల్లో, చివరకు విద్యాబుద్దులు చెప్పవలసిన గురువులు కూడా కౄరమృగాల్లా ప్రవర్తిస్తున్నారు.మోసపోవడానికి అమాయకులైతే చాలు, బలాత్కారం చేయడానికి ఆడపిల్లైతే చాలు వయస్సుతో సంబంధం లేకుండా కొందరు మగాళ్ళు అని చెప్పుకునే మృగాలు ప్రవర్తిస్తున్నాయి..


తెలివితోపాటు టెక్నాలజీ పెరిగిపోతుంది కాని మనం సమాజంలో బ్రతుకుతున్నట్లు అనిపించడం లేదు అడవిలో నక్కలు,తోడేళ్ళ మద్య బ్రతుకుతున్నట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నారు.
సమాజానికి ఏదైన చేయాలనే తపన పడేవారున్నారు కాని ఆ తపన కొందరికి ఎడారిలో ఎండమావిలా వుండిపోతుంది.కాని చిలుకూరు బాలాజి టెంపుల్లో వుండే ప్రధాన అర్చకుడు ఆడపిల్లలపై జరిగే దాడులను చూస్తూ తనకెందుకులే అనుకోని అగిపోలేదు తన ఆలోచనని సమాజంలో మార్పురావాలని కోరుకునే యువతతో కలసి ఓ రక్షణకవచాన్ని అబలల కోసం తయారుచేసారు దానిపేరే జటాయువు సైన్యం...


అత్యాచారానికి గురైన స్నేహిత అనే పసిపాప మరణం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.ఇక స్నేహిత బాధనుండి పుట్టిన ఈ జటాయువు ఆర్మీ రూపకల్పన ఆ పసిపాప తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిందని సీఎస్ రంగరాజన్ గారు తెలిపారు.చిలుకూరు బాలాజి ఆశీస్సులతో పుట్టిన చిన్నారిని అత్యంత పాశవికంగా చంపాడు ఓ కామాంధుడు.ఈ కేసులో దోషిని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళన ప్రదర్శనలు కూడా జరిగాయి.అయినా అత్యాచారాల పర్వం ఆగలేదు.ఇకనైన చిన్నారులపై గాని మహిళలపై కాని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఈ జటాయువు సైన్యం రక్షిస్తుందని,మానవత్వం వున్న ప్రతివారు ఈ దళంలో సైనికుల్లా పనిచేయాలని రంగరాజన్ గారు పిలుపునిచ్చారు..


ఇక ఈ జటాయువు ఆలోచనను సమాజం ఎలా స్వీకరిస్తుందోనని కాస్త ఆందోళన పడ్డాం ఆ దశలో సౌందరరాజన్ సలహాతో ప్రతిరోజు ఆలయంలోకి వచ్చే భక్తులకు జటాయువు పోరాటం గురించి చెబుతూ వచ్చామని దాంతో యువతలో క్రమక్రమంగా చైతన్యం పెరిగిందని రంగరాజన్ చెప్పుకొచ్చారు.ఆడపిల్లలకు రక్షణగా సమాజం మొత్తం నిలబడాలని అప్పుడే కోరుకున్న మార్పు జరుగుతుందని ఆయన విన్నవించారు.రామాయణంలో సీతను ఎత్తుకెళ్తున్న రావణుడితో పోరాడిన జటాయువుగా ప్రతి ఒక్కరుమారాలని కలుషితమైన ఈ మనషుల మనసులనుండి ఆడపిల్లలను కాపాడాలంటే లక్షలకొలది జటాయువు రక్షకులు కావాలని పిలుపునిచ్చారు...


మరింత సమాచారం తెలుసుకోండి: