చంద్రబాబు ఇంటి మీదుగా రెండు డ్రోన్లు వెళ్లాయన్న అంశాన్ని పట్టుకుని తెలుగుదేశం నేతలు ఓ రోజంతా అనుకూల మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అలా డ్రోన్లు పంపిన వాళ్లు ప్రభుత్వం పంపిన వాళ్లేనని.. సాక్షాత్తూ పోలీసులు చెబుతున్నా.. అబ్బే వారు వినేందుకు సిద్ధంగా లేరు. ఏదో ఒక ఇష్యూ దొరికింది దాన్ని రాజకీయాలకు వాడుకోవాలన్న తపన తప్ప.. ఈ విషయంలో అంతగా ఏముందన్నది అర్థం కాకుండా ఉంది.


ఇక ఈ ఇష్యూలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవర్తించిన తీరు.. చేసిన ఆరోపణలు ఓ రేంజ్ లో ఉన్నాయి. డ్రోన్‌తో చంద్రబాబు నివాసం చిత్రీకరించి ఏ ఎర్రచందనం దొంగలకు ఇద్దాం అనుకున్నారని దేవినేని ఉమా ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇంట్లో వ్యక్తే చిత్రీకరణ చేయించడం వెనుక కుట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. కృష్ణా వరద పై ప్రభుత్వం ఒక్క సమీక్ష అయినా చేసిందా ఉమా ప్రశ్నించారు.


చంద్రబాబు నివాసంలోకి నీళ్లు పంపాలనే పైశాచిక ఆనందం కోసమే వైసీపీ నేతలు తపించారట. అమరావతి మునిగిపోతే.. ఏకంగా జగన్ రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్దామని అనుకుంటున్నాడట. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కి అంత బాధ్యత ఉంటే వరద ఉన్న దుగ్గిరాలలో ఎందుకు పర్యటించలేదని ఉమా అడుగుతున్నారు. చంద్రబాబు ఇంటి చుట్టూనే తిరగాల్సిన అవసరం ఎమ్మెల్యేకు ఏమొచ్చిందని మండిపడ్డారు.


మంగళగిరి నియోజకవర్గంలో వరద బాధితులు ఎందరో ఆహారం, ఆసరా కోసం ఎదురు చూస్తుంటే ఆర్కే కి ఎందుకు పట్టలేదని ఉమా ప్రశ్నించారు. జగన్ కు నీటి నిర్వహణ తెలియకపోవడంతోనే ఇంత వరద వచ్చిందట. ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థతేనట. ఆల్మట్టి నిండిందని తెలిసినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారట. ఇదీ తెలుగుదేశం నేతల తీరు.. మనం ఏం చేసినా చూపించే మీడియా ఉంది.. అయితే ఒకటి గమనించాలి. ఈ అనుకూల మీడియా చేసిన ఓవరాక్షన్ కారణంగానే.. చంద్రబాబు అధికారం కోల్పోయారు. మళ్లీ అదే మీడియాను నమ్ముకుని ప్రజలకు దూరమవుతున్నారు. అది గమనిస్తే చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: