ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హామీల్లో ముఖ్యమైన పథకం మద్యపాన నిషేధం. విడతల వారిగా మద్యపాన నిషేధం చేస్తూ చివరకు మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్ళలో మాత్రమే లభ్యమయ్యేలా చేస్తానని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ దిశగా అడుగులు పడుతున్నాయి. నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 వ తేదీ నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 
 
రాష్ట్రంలో 4,380 మద్యం షాపులను 3,500 షాపులకు తగ్గించింది ప్రభుత్వం. ప్రభుత్వమే ఈ మద్యం దుకాణాలను నిర్వహించబోతుంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించబోతూ ఉండటం వలన 15,000 ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రభుత్వం. త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. నోటిఫికేషన్ విడుదలైన తరువాత అర్హత కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు మద్యం దుకాణంలో పని చేసే అవకాశం ఉంటుంది. డిపో మేనేజర్ అనుమతితో వీక్లీ ఆఫ్ పని చేసే సిబ్బందికి ఇస్తారు. పనితీరు బాగా ఉంటే రెండవ సంవత్సరంలో కూడా కొనసాగించే అవకాశం ఉంది. రెండవ సంవత్సరంలో కొనసాగిన వారికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తారు. సూపర్ వైజర్ డిపో మేనేజర్ సూచించే పనులతో పాటు రోజు వారీ లావాదేవీల నిర్వహణ, స్టాకు రిజిస్టర్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. 
 
మద్యం షాపులో ఏదైనా నష్టం వస్తే సిబ్బందిదే పూర్తి భాద్యత. అర్బన్ ప్రాంతాలలో ప్రతి మద్యం షాపుకు ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్ మెన్, ఒక వాచ్ మెన్ ఉంటారు. రూరల్ ప్రాంతాల్లో ప్రతి మద్యం షాపుకు ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్ మెన్, ఒక వాచ్ మెన్ ఉంటారు. సూపర్ వైజర్ కు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు అర్హత వయస్సుగా నిర్ణయించారు. సూపర్ వైజర్ మద్యం షాపు ఎక్కడ ఏర్పాటు అవుతుందో అదే మండలానికి చెందిన వారై ఉండాలి.   డిగ్రీ, బీకాం ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: