మొండివాడు రాజుని మించిన బలవంతుడని ముతక సామెత ఉంది. అది ఇపుడు నిజమవుతోంది. ఎవరెన్ని చెప్పిన్నా నా విధానం ఇదే నేను మారను కాక మారను అంటున్న పసుపు తమ్ముళ్ళ ముందు ఎవరైనా బలాదూరే. ఇదిలా ఉండగా ఏపీలో ప్రభుత్వం మారింది. అధికారం జగన్ చేతుల్లోకి వచ్చింది. అయినా కూడా పసుపు పార్టీ తన హవాను చాటుకుంటోంది.


చంద్రబాబు ఇల్లు కరకట్ట మీద అక్రమంగా నిర్మించిందని లోకానికి తెలుసు. ఆ సంగతి బాబుకు కూడా తెలుసు. అయినా సరే ఇపుడు అక్కడ నానా యాగీ చేస్తూ కనీసం విపక్ష నేత నివాసం వద్ద వరద పరిస్థితి ఎలా ఉందో కూడా చూడనిచ్చేందుకు తెలుగు తమ్ముళ్ళు సిధ్ధంగా లేరంటే ఆశ్చర్యమే మరి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు బాబు నివాసంలో వరద పరిస్థితి అంచనా వేయడానికి వెళ్తూంటే  వారిని  అడ్డుకోవడం నిజంగా బాధాకరమే.


చంద్రబాబు ప్రతిపక్ష నేత కావచ్చు. ముందు ఆయన ఏపీ పౌరుడు. ప్రభుత్వం ప్రతి పౌరున్ని రక్షించాలనుకుంటుంది. అది బాధ్యత. ఆ విధంగా చూస్తే బాబు ఇల్లుని చూస్తే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ లేదు, అడుగు ముందుకు పెట్టవద్దు అని తమ్ముళ్ళు అక్కడికి చేరుకుని నానా రచ్చ చేశారంటేనే బాబు అండ్ కో చేస్తున్నదేంటో అర్ధమైపోతోంది. 


సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు. బాబు ఇంటిని చూసేందుకు ప్రభుత్వం రాకూడదా అని ఆయన  ప్రశ్నించారు.  ఇదిలా ఉండగా బాబు ఇంట్లో అక్రమ వ్యాపారం ఏమైనా జరుగుతోందా అని వైసీపీ మంత్రి కొడాలి నాని నిలదీశారు. చూసెందుకు తామెందుకు రాకూడదని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి అధికారంలో లేకపోయినా కూడా మంత్రులను నిలువరించి టీడీపీ తమ్ముళ్లు గెలిచారు. 


ఇదిలా ఉండగా వరద ఉధ్రుతి ఫలితంగా మునిగే  ఏ ఇల్లు ఏంటన్నది చూసుకుని క్రిష్ణా నది మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తామని మంత్రి బొత్స చెప్పారు. దీని విషయంలో డ్రోన్ల సాయంతో తీసిన ఫొటోలను కూడా కోర్టుకు సమర్పించి అక్కడ నుంచే అనుమతులు తెచ్చుకుని మరీ న్యాయబద్ధంగానే అక్రమాలను కరకట్ట మీద నుంచి తొలగిస్తామని బొత్స వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: