చైనా మన దేశంలోని ప్రతి పౌరుడి సొమ్ముతో  సోకు చేస్తున్న దేశం. భారత దేశం 130 కోట్ల జనాభా. ఇంత పెద్ద మార్కెట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అందువల్ల చైనా మన  దేశం మీద పడి  బతికేస్తోంది. తన ఉత్పత్తులు అన్నీ కూడా ఇక్కడే అమ్ముకుని హ్యాపీగా డబ్బులు లాగేస్తోంది. ఓ విధంగాభారతీయుల రక్తం, శ్రమ చైనా ఆర్ధికాభివ్రుద్ధికి ఎంతో దోహదపడుతున్నాయి. 


కానీ చైనాకు అటువంటి మంచి భావనా ఎక్కడా భారత్ మీద ఉన్నట్లు కనిపించదు. వ్యాపారం భారత్ లో చేసుకుంటున్నా ఈ దేశం కీడు కోసమే తన శక్తియుక్తులన్నీ ధారపోస్తుంది. దాయాది పాక్ తో కలసి చెట్టపట్టాల్ వేస్తుంది. కాశ్మీర్ అంశం ఇంతగా రగలడానికి చైనా మద్దతు తోనే పాక్ రెచ్చిపోతోందన్నది అందరికీ తెలిసిందే.


ఇపుడు  ఐక్య రాజ్య సమితి అనధికార సమావేశం పెట్టించి కాశ్మీర్  అంశంపై చర్చించ‌డం ద్వారా చైనా మరో మారు పాక్ అనుకూల ధోరణిని చాటుకుంది. ఇంతకు నాలుగు రోజుల ముందు మన విదేశాంగ  శాఖా మంత్రి జయశంకర్ చైనాకు వెళ్లి మొత్తం పరిస్థితులు వివరించాక  కూడా పాక్ పక్షం తీసుకుని మొండిగా చైనా ఐరాసా అనధికార  మీటింగ్ జరిపించింది అంటే భారత్ మీద ఎంతలా చైనా విషం కక్కుతోందో అర్ధమవుతోంది.


డొక్లాం ఇష్యూలో చైనాకు గట్టిగా ఝలక్ ఇచ్చిన మోడీ సర్కార్ ఇపుడు కూడా ఆ దేశాన్ని విడిచిపెట్టకూడదని అంతా కోరుకుంటున్నారు.  భారత్ లోకి చైనా ఉత్పత్తులు బాగా తగ్గించడం ద్వారా ఆ దేశం ఆర్ధిక వ్యవస్థను దెబ్బ కొట్టాలన్న డిమాండ్ కూడా ముందుకు వస్తోంది. చైనా ఫోన్లు, చైనా దీపావళి క్రాకర్లు, చైనా హోమ్  నీడ్స్ ఒకటేంటి అన్ని కూడా చైనా నుంచి వరదలా భారత్ లోకి వచ్చేస్తున్నాయి. దేశ పౌరుల్లో కూడా దేశభక్తిని నింపడం ద్వారా చైనా వాణిజ్యానికి చెంప పెట్టులాంటి గుణపాఠం చెప్పాలన్న ఆకాంక్ష


కూడా జనంలో ఉంది. మోడీ ఇప్పటికైతే పాక్ పీచమణిచారు. దానికి ప్రపంచంలో ఏకైక గట్టి మద్దతుదారుగా ఉన్న చైనాను కూడా దారికి తీసుకువారాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్ విభజన ఏక పక్ష నిర్ణయం అంటూ మాటలు తూలుతున్న చైనా విషయంలో మన విధానం పదును తేరాలి. అంతే కాదు, మన విదేశాంగ విధానం కూడా ఇంకా దూకుడుగా ఉండాలి. ప్రపంచ దేశాల్లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టేలా సాగాలి. దానికి మోడీ సమర్ధుడే. ఇక యాక్ష‌న్ లోకి దిగడమే తరువాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: