రూ. 4,243 కోట్లు...ఈ ఏడాది జూన్‌లో విదేశీ పర్యటనల కోసం భారతీయులు చేసిన ఖ‌ర్చు. 2017లో ఈ సంఖ్య కేవలం 2.4 కోట్లు కాగా...2019లో మొత్తం 5 కోట్ల మంది భారతీయులు విదేశీ పర్యటనలు చేస్తారని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది. అయితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏటా రెండు కోట్ల మంది భారతీయులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని, అయితే, వీళ్లు స్వదేశీ పర్యటనలు ప్రారంభిస్తే వసతులు మెరుగుపడుతాయని, యువతకు ఉపాధి దొరుకుతుందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022 నాటికి దేశంలోని 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకోవాలంటూ దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.


ఫారెక్స్ (విదేశీ మారక ద్రవ్యం) విదేశీ పర్యటనల కోసం నిల్వలను కొనడం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో దేశ ప్రజలు రూ. 29,780 కోట్ల విలువ గల విదేశీ కరెన్సీని కొనుగోలు చేశారు. ఇందులో రూ. 11,353 కోట్ల(42శాతం) విదేశీ మారక ద్రవ్యాన్ని కేవలం పర్యటనల కోసమే కొనుగోలు చేశారు. 2014లో సరళీకృత చెల్లింపుల పథకం ప్రారంభించిన తర్వాత ఇదే రికార్డు కొనుగోలు. భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) డాలర్ కొనుగోలును వివిధ రకాలుగా విభజించింది. గణాంకాల ప్రకారం.. 2019 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు రూ. 98,293 కోట్ల విలువ గల విదేశీ మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.34,188 కోట్లు (35శాతం) విదేశీ పర్యటనల కోసం వెచ్చించారు. రూ. 25,641 కోట్లు (26 శాతం) విద్యకు, రూ. 19,943 కోట్లు (20 శాతం) బంధువుల కోసం ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్న బంధువులకు బహుమతులు ఇవ్వడానికి భారతీయులు ఏకంగా రూ. 9,971 కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యకరం.



మరింత సమాచారం తెలుసుకోండి: