మన తెలుగు వారు మిగతావారికంటే ఏ మాత్రం తక్కువ కాదని, మన తెలుగు వారి వాడి వేడిని జాతీయ స్థాయిలో వినిపించేందుకు 1982లో అన్న విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని నెలకొల్పడం జరిగింది. అయితే పార్టీ నెలకొల్పిన తరువాత జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టిడిపి తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొట్ట తొలి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు అప్పట్లో పీఠాన్ని అధిష్టించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా టిడిపి విజయం సాధించడం, తన పాలనలో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆపై ఆ పార్టీలో చంద్రబాబు గారి చేరిక, అనంతరం కొన్నాళ్ళకు పార్టీలోని కొన్ని అంతర్గత సమస్యల కారణంగా 1995 తరువాత పార్టీ చంద్రబాబు గారికి చేతికి చేరడం, ఆ తరువాత 1996లో అన్న ఎన్టీఆర్ గారి హఠాన్మరణం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే అధినేతగా పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు గారు టిడిపిని ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లడమే కాక, క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు పార్టీ కార్యకర్తలను మరియు నాయకులను కలుపుకుని ముందుకు సాగడంతో పాటుగా, 1995-99, 1999-2004 వరకు టిడిపి తరపున దాదాపుగా 9 ఏళ్ళ పాటు ఆంధ్ర ప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా సేవలను అందించడం జరిగింది. 

అలానే ఇటీవల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజించబడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో మరొక్కసారి టిడిపి విజయాన్ని సాధించడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే ఆ సమయంలో తన కుమారుడు లోకేష్ ను తొలిసారి చంద్రబాబు ఎమ్యెల్సీ గా ఎంపిక చేసి, ఆ తరువాత ఆయనను ఐటీ, మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా నియమించడం జరిగింది. ఇక మొన్నటి 2019 ఎన్నికల్లో లోకేష్ ను మంగళగిరి నియోజక వర్గంలో ఎమ్యెల్యే గా పోటీకి బరిలో నిలబెట్టడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో లోకేష్ ఓటమి పాలయ్యారు. నిజానికి తనకు వయసు మీద పడడంతో ఎలాగైనా మొన్నటి ఎన్నికల్లో లోకేష్ ని గెలిపించి, మెల్లగా పార్టీకి అతడిని చేరువచేయాలని, అలానే ఆపై మెల్లగా కొంత కాలం గడిచిన తరువాత టీడీపీ పార్టీని అతడికి అప్పగించాలని చంద్రబాబు భావించినట్లు కొన్ని రాజకీయ వర్గాల్లో గుసగుసలు కూడా వినిపించాయి. కానీ అనూహ్యంగా లోకేష్ ఓటమి పాలవడంతో, ఆయన ఆశలన్నీ అడియాశలయ్యాయని, ఇక మళ్ళి ఎన్నికలు వచ్చేది 2024లోనే కాబట్టి, అప్పటికైనా లోకేష్ ను ఇప్పటినుండే మరింతగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు చేరువయ్యేలా ముందస్తు ప్రణాళిక రచించినట్లు సమాచారం. 

అయితే కొందరు టీడీపీ నాయకుల అంతర్గత సమాచారం బట్టి, చంద్రబాబు తరువాత టిడిపి పగ్గాలు లోకేష్ కు కనుక అప్పగించినట్లయితే, పార్టీ ముందుకు సాగడం కొంత కష్టతరవం అవుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది . చంద్రబాబు గారు మంచి విజన్ ఉన్న నేత అని, అంతేకాక ఎన్నో ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం వలన ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని టీడీపీని ఎంతో సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగారని, అందుకు ఆయన వాక్చాతుర్యం, వ్యవహార శైలి చాలావరకు దోహదపడ్డాయంటున్నారు. అయితే లోకేష్ కు ప్రధమంగా లేనివే అవని, ముఖ్యంగా ప్రజలతో పార్టీ కార్యకర్తలతో ఎలా మమేకం అవ్వాలనే విషయాలపై ఇంకా లోకేష్ కు పూర్తిగా అవగాహన లేదని వారు అంటున్నారట. అంతేకాక చంద్రబాబు ఆలోచన ప్రకారం ఒకవేళ లోకేష్ కు పార్టీని అప్పగిస్తే, మున్ముందు సరైన నాయకత్వం లేక పార్టీ కుంటు పడుతుందని అంటున్నారట. అయితే ఈ విషయమై కొందరు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ, ఎవరికైనా కొంత అనుభవం అవసరం అని, కాబట్టి రాబోయే రోజుల్లో లోకేష్ కనుక మరింతగా ప్రజల్లోకి వెళ్లి, వారికి చేరువ అవడం, అలానే పార్టీలోని ప్రతిఒక్కరిని తెలివిగా కలుపుకుపోవడం వంటివి పాటించగలిగితే భవిష్యత్తులో అతడు టిడిపిని బాగానే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని వారు అంటున్నారు.......!!   


మరింత సమాచారం తెలుసుకోండి: