సూపర్ స్టార్ రజనీకాంత్ పోలిటికల్ ఎంట్రీ కోసం తమిళనాడులోని అభిమానులతో పాటు, దక్షిణ భారతదేశంలోని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని ఆతృతతో ఉన్నారు.  ఎప్పటి నుండో రజనీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ రజనీ ఇంకా పోలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా దేవుడు ఆదేశిస్తే వస్తానని పలుమార్లు చెప్పిన రజనీ అభిమానుల కోరిక మేరకు  2017 డిసెంబరులో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నానని,  త్వరలోనే పార్టీని ప్రారంభిస్తానని ప్రకటన కూడా చేశారు.


అందుకు తగ్గట్టుగానే అభిమాన సంఘాలని ప్రజా సంఘాలుగా మార్చేసి 234 నియోజకవర్గాల్లో నాయకులుగా నియమించారు. అలాగే బూత్ కమిటీలని ఏర్పాటు చేసి కోటి సభ్యుల నమోదుని అబిమానులకి టార్గెట్ గా పెట్టారు. అభిమానులు ఆ టార్గెట్ ని కూడా రీచ్ అయిపోయి రజనీ ఎంట్రీ కోసం చూస్తున్నారు. అయితే రజనీ పోలిటికల్ ఎంట్రీ ఈ ఏడాది ఉండదని తెలుస్తోంది. 


2021లో ఎన్నికల నేపథ్యంలో దానికంటే ఒక సంవత్సరం ముందుగా పార్టీ పెడితే ప్రయోజనం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకని 2020లో పార్టీని ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏడాది మార్చి నెలలో రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లతారని తెలుస్తోంది. కాగా, రజనీకాంత్‌ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన అనేక సార్లు బీజేపీకి మద్ధతుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 


అయితే రజనీ బహిరంగంగా వెల్లడించకపోయినా, పొత్తుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అటు బీజేపీ కూడా ఈసారి తమిళనాడులో ఎలా అయిన పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకెతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతుంది. ఈ క్రమంలో రజనీతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళితే ప్రయోజనం ఉంటుందని అనుకుంటుంది. మరి చూడాలి ఎన్నికల సమయంలో తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: