ఆర్టికల్ 370 చుట్టూ  ఉంటున్న సమస్యలు ప్రత్యేకంగా జమ్మూ & కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా, అంతర్గత విషయం అని తెలుపుతూ, కాశ్మీర్‌పై శుక్రవారం జరిగిన  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి “క్లోజ్డ్ కన్సల్టేషన్” సమావేశం లో  తెలిపింది. పాకిస్తాన్ మరియు చైనా సమావేశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయని ఐరాసలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఆరోపించారు. "భద్రతా మండలి తో  సంప్రదింపులు ముగిసిన తరువాత, ఇష్టానుసారం  రెండు దేశాలు అంతర్జాతీయ సమావేశం  పై తమకు నచ్చిన విధంగా జాతీయ ప్రకటనలు చేసినట్టు మేము గుర్తించాము" అని  అక్బరుద్దీన్ సమావేశం లో తను మాట్లాడినప్పుడు చెప్పారు.

 “ సెక్యూరిటీ కౌన్సిల్  అందరికీ పరిగణించబడిన పద్ధతిలో పనిచేస్తుంది. దీని సమవేశాల ప్రకటనల గురించి మనందరికీ [యుఎన్‌ఎస్‌సి] అధ్యక్షుడు తెలుపుతారు. ఇస్టాను సారంగా దేశాలు  సమావేశాల ప్రకటనలు చేయడం వల్ల, నేను కూడా మీ వద్దకు వచ్చి మా జాతీయ స్థితిని వివరిద్దామని అనుకున్నాను, ”అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 అనేది భారతదేశానికి పూర్తిగా అంతర్గత విషయం దానిలో ఎవరికి సంభందం లేదని తెలిపారు. 

భారతదేశం లేదా పాకిస్తాన్ యుఎన్‌ఎస్‌సి క్లోజ్డ్-కన్సల్టేషన్స్‌లో భాగం కాలేదు, ఇవి అధికారికంగా ప్రకటనలు లేని లేని అనధికారిక సమావేశాలు. కొన్నిసార్లు "ప్రెస్ ఎలిమెంట్స్" ని యుఎన్‌ఎస్‌సి సభ్యుల ఏకాభిప్రాయంతో అంగీకరించవచ్చు, కాని శుక్రవారం సమావేశం నుండి అలాంటి ప్రకటన ఏదీ బయటపడలేదు. 


జమ్మూ కాశ్మీర్‌లో సుపరిపాలన మరియు సామాజిక-ఆర్ధిక అభివృద్ధిని పెంపొందించడానికి ఆర్టికల్ 370 ను రద్దు చేయడం జరిగిందని, యుఎన్‌ఎస్‌సి సంప్రదింపులు దీనిని గమనించాయని మిస్టర్ అక్బరుద్దీన్ విలేకరులతో అన్నారు. మిస్టర్ అక్బరుద్దీన్, తన చైనీస్ మరియు పాకిస్తాన్ సహచరులను అనుసరించి, వారికి విరుద్ధంగా, పాకిస్తాన్ నుండి సహా విలేకరుల నుండి ప్రశ్నలు తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: