ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన కొనసాగుతున్న సమయంలో చంద్రబాబుకి కుడి భుజంగా ఉంటూ వచ్చిన ముఖ్యనేత మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గురించి అందరికీ తెలిసిందే.  అప్పట్లో ఈయన టీడీపీ లో చక్రం తిప్పారు.  అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ని విభేదించారు.  కొంత కాలంగా పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. కాకపోతే టీడీపీని మాత్రం విడువలేదు. తాజాగా తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే ఇక్కడ రాజకీయాల్లో కొంత కాలంగా జంపింగ్ పర్వాలు తీవ్రమయ్యాయి.   ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. 

పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి టి. దేవేందర్‌గౌడ్ త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల భారత దేశంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన తర్వాత ఎంతో మంది పార్టీ సీనియర్ నేతలు కమలం పార్టీలో జాయిన్ అవుతున్నారు.  ఇప్పటికే ఏపిలో పలువురు సీనియర్ టీడీపీ నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో ఈ మద్య మాజీ ఎంపీ వివేక్ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. తాజాగా మరికొంత మంది సీనియన్ నేతలు బీజేపీలోకి రాబోతున్నారని బండారు లక్ష్మణ్ తెలిపారు.

తాజాగా  టి. దేవేందర్‌గౌడ్  బీజేపేలో చేరుతున్నారని..అయనతో పాటు వీరేందర్ గౌడ్ కూడా కమలం తీర్థం పుచ్చకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.  దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. ఆ వెంటనే ఆయనను బీజేపీ నేతలు సంప్రదించారన్న ప్రచారం కూడా జరిగింది.  కాకపోతే ఈ విషయంపై స్పష్టత రాకున్న బీజేపీలో చేరడం మాత్రం పక్కా అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: