ఆర్టికల్ 370 రద్దు తరువాత బీజేపీ బలం క్రమంగా పెరుగుతున్నది.  బీజేపీని అభిమానించే వ్యక్తులు పెరిగిపోతున్నారు.  ఒకరుకారు ఇద్దరు కాదు వేలాది మంది సభ్యత్వం తీసుకుంటున్నారు.  బీజేపీ దేశం కోసం ఏదైనా చేయగలదని నమ్ముతున్నారు.  అలా నమ్ముతున్న వ్యక్తుల్లో ఇప్పుడు సినీ నటుడు,  వామపక్షజాలం బలంగా ఉన్న నటుడు ఆర్ నారాయణ మూర్తి కూడా చేరిపోయారు.  


జమ్మూ కాశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పి నారాయణ మూర్తి చెప్పడం విశేషం.  ఆర్టికల్ 370 రద్దును ఎప్పుడో చేయాల్సి ఉన్నా.. రాజకీయాల కారణంగా పెండింగ్ పెడుతూ వచ్చారని, ఇప్పటికైనా రద్దు చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు.  బీజేపీ చెప్పింది చేసి చూపించింది.  ధైర్యంగా ఆలా చెప్పడం.. చెప్పిన దాన్ని చేసి చూపించడం చాలా కష్టం అని.. దేశంలో త్వరలోనే ఇంకా చాలా మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు.  


జమ్మూ కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం మంచి పరిణామం అని, ఇప్పుడు ఆ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతానని చెప్పారు.  గోదావరి జలాలను ఉత్త రాంధ్రకు తరలింపుపై పోరాటం చేస్తున్నామని, గోదావరి జలాలను ఇప్పటికే పురుషోత్త పట్నం ద్వారా తరలించారని, అదే విధంగా ఉత్తరాంధ్ర నదులను గోదావరికి అనుసంధానం చేస్తే సస్యశామలం అవుతుందన్నారు. ఏది సాధించాలన్నా దానికి తగినట్టుగా పోరాటం చేయడం ముఖ్యం.  ధైర్యంగా పోరాటం చేస్తే తప్పకుండా సాధించవచ్చు.  


పోటీ చేయడంపై కూడా నారాయణ మూర్తి స్పందించారు.  గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అఫర్ చేశాయని, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం పోటీ విషయం గురించి ఆలోచించనని నారాయణ మూర్తి పేర్కొన్నారు.  సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పకున్నాక ఆ విషయం గురించి ఆలోచిస్తా అని చెప్పాడు. నారాయణ మూర్తి పోటీ చేస్తా అంటే ఏ పార్టీ టిక్కెట్టు ఇవ్వదు చెప్పండి. సౌమ్యుడు అందరిని సమానంగా చూసే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయనకు ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: