ఆర్టికల్ 370 రద్దు ఇండియాను ప్రపంచ దేశాల్లో ఒక బలమైన దేశంగా మార్చింది.  అలా బలమైన దేశంగా మారడానికి ఒక కారణం పాకిస్తాన్.. చైనాలే అని చెప్పొచ్చు.  ఎందుకంటే, ఆర్టికల్ 370 రద్దు తరువాత.. పాకిస్తాన్ ఇండియాపై అక్కసుతో ప్రపంచ దేశాల్లో దోషిగా నిలబెట్టేందుకు అందరికి కంప్లైట్ చేయడం మొదలు పెట్టింది.  కంప్లైంట్ బాక్స్ ను తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళింది.  దీంతో ఏమైంది.. కంప్లైంట్ బాక్స్ పట్టుకు తిరిగిన పాక్ కు దెబ్బ పడింది.  


పాక్ కు చిరకాల మిత్రదేశంగా ఉన్న చైనా పాక్ విషయంలో జెండా పట్టుకు తిరిగి బేర్ మన్నది.  ఎలాగో చైనా భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కాబట్టి.. పాక్ అడిగినట్టుగా అక్కడ పావులు కదిపింది.  పాక్ మాటలను పట్టించుకునే వ్యక్తులు ఐక్యరాజ్య సమితిలో కరువయ్యారు.  పాక్ కు కేవలం చైనా తప్పించి మరే దేశం కూడా సపోర్ట్ చేయడం లేదు.  సొంత దేశాలుగా చెప్పుకునే అరబ్ దేశాలు కూడా పాక్ ను అనుకూలంగా మాట్లాడటం లేదు.  


కారణం చైనా.  చైనా ఆధిపత్యం కోసంఅరబ్ దేశాలను కూడా ఎదిరించే పరిస్థితి వచ్చింది.  చైనాకు పాక్ స్నేహం ఉన్నంత కాలం అరబ్ దేశాలు కూడా అంటీఅంటనట్టుగా ఉంటాయి.  ఇండియాకు సపోర్ట్ చేస్తుంటాయి.  ఎందుకంటే ఆసియాలో అత్యంత బలమైన దేశంగా ఎదుగుతున్న దేశాల్లో ఇండియా ఉన్నది.  ఒకప్పుడు ఇండియా బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడేది.  మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దౌత్యపరంగా ప్రపంచ దేశాలతో నెరపిన సంబంధాలు బలాన్ని ఇచ్చాయి.  


కాశ్మీర్ విషయంలో పాక్ మాటను మోసుకొని పోయి భద్రతా మండలిలో పెట్టింది చైనా..  చైనా ఒక్కటే సపోర్ట్ చేసింది.  శాశ్వత సభ్యదేశాలైన ఫ్రాన్స్, రష్యాలు ఇండియాకు మద్దతుగా నిలిచాయి.  అటు 10 తాత్కాలిక సభ్యదేశాలు కూడా ఇండియాకు సపోర్ట్ నిలవడం విశేషం.  రహస్యంగా జరిగిన ఈ చర్చల్లో ఇండియాకు మద్దతు లభించడం విశేషం.  అయితే, అమెరికా మాత్రం తన వైఖరిని తెలియజేయలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: