ఇటీవల కొన్ని రోజలుగా మన రాష్ట్రంలో వర్షలు సరిగా కురవలేదని పలు ఆలయాల్లో యాగాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే వాటి ప్రభావం వలనో ఏమో, ఆ తరువాత వర్షాలు బాగానే పడ్డాయి. ఇక ఆ వర్షాభావ పరిస్థితుల వలన గడచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజిలోకి నీరు చేరుకోవడం జరిగింది. దానితో కృష్ణమ్మ నీటి పరవళ్లకు బ్యారేజి కొంత ఆందోళనకర పరిష్టితికి చేరుకుంది. నిజానికి గతంలో కాంగ్రెస్ హాయంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య గారు ఎప్పటికైనా అధిక వర్షాల వలన వరద ఉదృతి ఈ బ్యారేజి తట్టుకోలేదని ఆనాడే కొంత అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 

ఆ సమయంలో ఒక్కరోజే 14లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన తరువాత, బ్యారేజీకి సంబంధించి దెబ్బతిన్న రెండు పిల్లర్లను మరమ్మతులు కూడా చేయడం జరిగింది. ఆ తరువాత ఎప్పుడూ అంత నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేయనేలేదు.ఇక మళ్ళి దశాబ్ద కాలం తరువాత ఎగువన కురిసిన వర్షాల కారణంగా నిన్న ఏకంగా 8.5లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరడంతో బ్యారేజీపైన ఉన్న రెయిలింగ్‌ కూలిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 24, 39వ ఖానాల వద్ద వరద ఉద్ధృతి కారణంగా ఫుట్‌పాత్‌ కోసం ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ దెబ్బతినడంతో, అది ఏక్షణంలోనైనా పడిపోవచ్చునని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

అయితే కృష్ణమ్మ పరవళ్లు తిలకిద్దామని బ్యారేజీకి చేరుకునే వారి సంఖ్య పెరిగడంతో, అప్రమత్తమైన పోలీసు అధికారులు,  భద్రతా కారణాల దృష్ట్యా మొదట ఆటోలు, కార్లు వంటి వాహనాలను బ్యారేజీ వైపునకు వెళ్లకుండా నియంత్రించారు. తరువాత పరిస్థితి మరింత తీవ్రం కావడంతో వీక్షకులను కూడా అటువైపునకు వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. బ్యారేజీపైన రెయిలింగ్‌ సరిగా లేకపోవడంతో ఆ దృశ్యాన్ని ఆనందంగా సెల్ఫీలు తీసుకోవాలని భావించే వారు ప్రమాదాల బారిన పడకూడదనే ఉద్దేశ్యంతోనే పోలీసులు ప్రజలను బ్యారేజీపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. మరి బ్యారేజిలోని ప్రస్తుత నీటి ఉదృతి పరిస్థితిని అదుపు చేయడానికి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: