ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.  టీడీపీ ఎన్నో అంచనాలు పెట్టుకున్నా అతి దారుణంగా ఓటమి పాలైంది.  అయితే గత ఐదేళ్లలో టీడీపీ చేసిన పాపాలే వారి ఓటమికి కారణాలు అని వైసీపీ నేతలు అంటున్నారు.  ఇదే విషయాన్ని అసెంబ్లీ వేధికగా టీడీపీ అధినేత చంద్రబాబు తో సహ ఇతర ఎమ్మెల్యలను కడిగి పడేశారు.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రతిపక్ష నేతలపై వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

తాజాగా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..చంద్రబాబు అంటే కరువు అని, ఆయన పాలన మొదలయ్యాకా సంమృద్దిగా వర్షాలు పడవని, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన ఆయన ఎందో మంది నిరుద్యోగుల ఉసరు తీసుకున్నారని అన్నారు.  అంతే కాదు చంద్రబాబు అధికారంలో ఉంటే వర్షాలుండవని.. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉంటే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనే ప్రతిఒక్కరూ అంటారు. 

ఇప్పుడు అది నిజంగా కనిపిస్తుంది..సీఎం గా వైఎస్ జగన్ పదవిలోకి వచ్చిన 80 రోజుల్లోనే ఆయన ఎన్ని మార్పులు చేర్పులు తీసుకు వచ్చారో ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిసుందని అన్నారు. మంచి చేసే వారికి ప్రకృతి కూడా సహకరిస్తుందని ఇప్పుడు వర్షాలు సమృద్దిగా పడుతు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని అన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడైనా ఇంతటి జలకళ చూడలేదన్నారు, ఆయన ఉన్నపుడు ఇక వర్షాలు రావని..నీరు నిండదనే భావనతోనే అక్కడ ఇంటి నిర్మాణం చేశారని..కానీ సీఎం జగన్ పదవిలోకి రాగానే వర్షాలు నిండుగా కురిసాయని... కృష్ణా నదికి బాగా నీరు చేరడంతో ఆయన ఇంటికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. 


మరోవైపు ఈ వరదలకు వైసీపీ ప్రభుత్వమే కారణమనే వ్యాఖ్యాలు చేస్తే ఇక చంద్రబాబును ఎవ్వరూ మార్చలేరన్నారు.  మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఈ వరదలు మేన్ మేడ్ వరదలని ఆరోపించిన ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఆల్మట్టి డ్యామ్, జూరాల వంటి ప్రాజక్టులన్నీ నిండిపోవడం మేన్ మేడ్ అంటారా అని ఎద్దేవా చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: