పులిచింతల ముంపు బాధితులకు ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తొంభై శాతం పరిహారం చెల్లించామని మిగితావి నెలన్నర లోపు చెల్లిస్తామని సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ చెప్పారు. జిల్లా లోని పులిచింతల ప్రాజెక్టు కు పోటెత్తుతున్న కృష్ణమ్మ వరద ఉధృతిని పరిశీలించారు. మట్టపల్లి ఆలయం ముంపు కారణాలపై వారం రోజుల్లో సమీక్ష నిర్వహించి చర్యలు చేపడతామన్నారు .పులిచింతల ముంపులో కొట్టుకుపోయిన పంట పొలాల నివేదికలను సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.


 కొనసాగుతున్న వరద ఉధృతిని తట్టుకునేలా ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని  కలెక్టర్ అమయ్ కుమార్ వెల్లడించారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది, గత నాలుగు రోజుల నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది దాదాపు నిన్న రాత్రి నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు చేరుతోంది. అదే స్థాయి లో అవుట్ లో కూడా పులిచింతల ప్రాజెక్టు నుంచి ఇరవై రెండు గేట్లు ఎత్తి ఆ ప్రకాశం బ్యారేజిపై వదులుతున్నారు. దీని సంబంధించి దాదాపు ఎగువ రాష్ట్రా లు శ్రీశైలం గానీ నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద ఏమాత్రం ఇబ్బంది లేకుండా మొత్తం అధికారులు చర్యలు చేపట్టారు. 


కృష్ణా వరద ఉదృత్తి రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇల్లు అన్ని నీట మునగగా, ప్రజలను బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు బాగా వచ్చి చేరుతుండటంతో అన్ని చోట్ల డ్యాం గేట్లను ఎత్తి వేస్తున్నారు అధికారులు.వరద ప్రవాహానికి కృష్ణా బ్యాక్ వాటర్ ఎక్కువవ్వడంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమైయ్యాయి.బ్యాక్ వాటర్ కారణంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభువు  లక్ష్మినరసింహస్వామి క్షేత్రం గర్భగుడి కూడా నీటిలో కలిసిపోయింది.

రెండు వేల తోమ్మిదిలో మట్టపల్లి ఆలయం పూర్తిగా నీటిమట్టం కాగా అది దృష్టిలో ఉంచుకొని అధికారులు ఒక పెద్ద గోడను నిర్మించారు.
 కానీ ఆ నిర్మణంలో కూడా లీకేజీలు ఇప్పుడు బయటపడ్డాయి.దీనివల్ల ఆలయం గర్భగుడిలోకి నీరు చేరి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు.ఈ అంశం పై  ప్రభుత్వం మీద  తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారులు మరియు భక్తులు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే అన్ని చోట్ల డ్యాం గేట్లు ఎత్తి వేశారు. అలాగే పులిచింతలలో కూడా 22 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు అధికారులు


మరింత సమాచారం తెలుసుకోండి: