జనసేన పార్టీని  క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు .  పార్టీని బలోపేతం చేయాలంటే  ముందు గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని పలువురు పలువురు సీనియర్లు చేసిన సూచనల మేరకు పవన్ కళ్యాణ్ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. గ్రామ , మండల స్థాయి కమిటీల ఏర్పాటు కోసం పార్టీలోని కీలక నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది . పార్టీ కమిటీ లలో  అన్ని వర్గాలకు వారికి సమాన ప్రాతినిధ్యం  కల్పించాలని పవన్ కళ్యాణ్ వారికి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి .


  పార్టీ కమిటీలో అన్ని వర్గాలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పించాలన్న పవన్ కళ్యాణ్  నిర్ణయం స్వాగతించదగ్గదేనని కానీ అయన నిర్ణయం  వెనుక కాపులకు  కమిటీ లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న వాదనలు తప్పించుకోవచ్చునని  ఆయన భావిస్తున్నట్లు కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .  పార్టీ కమిటీలో కాపులకు అధిక  ప్రాధాన్యత ఇస్తే జనసేన కాస్తా  కాపుల పార్టీ అని ముద్ర పడే అవకాశం ఉందని,  అందుకే అన్ని వర్గాలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పించాలని పవన్ సూచించి ఉంటారని విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే  జనసేన పై కుల ముద్ర పడిందని భావిస్తోన్న  పవన్,  పార్టీ కమిటీల ఏర్పాటు లోనూ అన్ని వర్గాలకు సమన ప్రాధాన్యతను కల్పించడం ద్వారా ఆ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారని  రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాపుల అధికంగా ఉండే భీమవరం, గాజువాక  అసెంబ్లీ స్థానాల నుంచి తాను  పోటీ చేయడం వల్ల తనపై కూడా ఎంతోకొంత కుల ముద్ర పడిందన్న నిర్ణయానికి వచ్చిన ఆయన ,  పార్టీ కమిటీ లో  అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా జనసేన అన్ని వర్గాల పార్టీ అన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపదల్చినట్లు స్పష్టమవుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: